దిగ్భ్రమపరిచే కొన్ని వాస్తవాలు

నా స్నేహితుడి పుణ్యమాని ఈ వారం కొన్ని విభ్రాంతికరమైన వాస్తవాలు తెలుసుకున్నాను. అందులో చాలా విషయాలు నాకు తెలియనివి, బాల్యంలో జరిగినవి. ఇంత వివరంగా ఏ రోజూ  చదివిన విన్న పాపాన పోలేదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండే అవకాశాలున్నాయి కాబట్టి వాళ్ళంతా ఈ టపా చదివి మనల్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్న దేశనాయకులు ఎంతటి గొప్పవాళ్ళో,  సోనియా గాంధీ, రాహుల్‌గాంధీల చరిత్ర ఎటువంటిదో, ఎంతటి అనుమానాస్పద జీవితాలు గడుపుతూ  దేశ రాజకీయాలను, ప్రజాజీవితాన్ని ప్రభావితం చేస్తున్నారో తెలుసుకుంటారని ఆశిస్తాను. దేశప్రయోజనాలను పణంగా పెట్టి వీళ్ళు దోచుకుంటున్న విధానం చూస్తుంటే అసహ్యం కలగక మానదు. యావద్భారతం ఎంతలా అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అర్థమవుతుంది. 'చల్తా హై యార్ ' అనే మనస్త్వతం పోనంతవరకూ మనకీ గతి తప్పదు. వాస్తవానికి ఈ టపాలో ఉన్న సమాచారమంతా జనతాపార్టీ అధ్యక్షుడైన సుబ్రహ్మణ్యస్వామి వెబ్‌సైట్ నుంచి, ఆయన వీడియోల(యూట్యూబ్) నుంచి సేకరించినదే. చదువరుల సౌకర్యార్థం దాన్నే  పాయింట్స్‌గా విడగొట్టాను.
 సుబ్రహ్మణ్యస్వామి జనతాపార్టీ వ్యవస్థాపకులలో ఒకరు.Indian Statistical Institute కలకత్తాలో గణాంకశాస్త్రం(Statistics)లో పి.జి.చేసి స్కాలర్‌షిప్ ద్వారా  ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రం(ఎకనమిక్స్)లో డాక్టరేట్ పొందారు. నోబెల్‌బహుమతి గ్రహీతలైన సైమన్ కజ్‌నట్స్, పౌల్‌సామ్యెల్సన్‌తో కలిసి అనేక వ్యాసాలు సమర్పించారు. చాలా సంవత్సరాలపాటూ అర్థశాస్త్రాన్ని బోధించారు.1969 నుంచి 1991 వరకూ ఢిల్లీ  IITలో ఎకనమిక్స్ ఫ్రొఫెసర్‌గా పనిచేశారు. దివంగత మాజీ ప్రధాని చంద్రశేఖర్ హయాంలో క్యాబినెట్ మంత్రిగా న్యాయశాఖ,వాణిజ్యశాఖలను నిర్వర్తించారు. లోక్‌నాయక్ స్వర్గీయ జయప్రకాష్ నారాయణ్ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని న్యాయం కోసం అలుపెరుగని పోరాటాలెన్నో చేశారు. న్యాయశాస్త్రం క్షుణ్ణంగా తెలిసినవారు.ఆయన కేసులన్నీ ఆయనే వాదిస్తారు.ఇటీవలే బయటపడి దేశాన్ని ఒక కుదుపు కుదిపి, రాజకీయాల్లో పెనుమార్పులకు కారణమై, తమిళనాట డి.ఎం.కే ప్రభుత్వానికి భరతవాక్యం పలికిన , 2G-స్పెక్ట్రం స్కాంని ఈయనే వెలికితీశారు.సోనియా గాంధీ పుట్టుపూర్వోత్తరాలు - చదువు 
 • సోనియా గాంధీ అసలు పేరు ఆంటోనియా మైనో. భారతదేశపు పాస్‌పోర్టు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్‌లో ఆమె పేరు అదే. ఆమె తండ్రిగా చెప్పబడుతున్న స్టెఫానో మైనో, హిట్లర్ తరపున యుద్ధం చేసి రష్యాలో యుద్ధఖైదీగా పట్టుబడ్డాడు. జర్మన్‌సైనికులకి హీనపక్షం 20 సంవత్సరాల జైలుశిక్ష విధించి కానీ వదిలిపెట్టని రష్యన్లు స్టెఫానో మైనోని మాత్రం రెండేళ్ళకే విడిచిపెట్టారు.రష్యన్ సీక్రెట్‌సర్వీస్ సంస్థ  KGBలో పనిచేయడానికి ఒప్పుకున్నందుకే అతనిని వదిలేశారని ఆభియోగం. జైలు నుంచి విడుదలైన స్టెఫానో రష్యన్ల మీద మమకారంతోనో మరొక కారణంతోనో పెద్ద కుతురు ఆంటోనియాని సోనియాగా, మరో కూతురు అలెస్సాండ్రాని అనౌష్కగా నామకరణం చేశాడు. సోనియా, అనౌష్క అన్నవి రష్యన్‌జైలులోని మహిళా జైలు వార్డెన్ల పేర్లు. అయితే సోనియా గాంధీ పుట్టేనాటికి స్టెఫానో మైనో రష్యన్‌జైల్లో ఉన్నాడని అతను ఆమె అసలు తండ్రి కాదనే వాదనా ఉంది. తను పుట్టినతేది మీద సోనియాగాంధీకే స్పష్టత లేనట్టుంది. ఒక దాన్లో 1944 అని మరొక దాన్లో 1946 అని ఉంది. 1942 నుంచి 1945 వరకు  స్టెఫానోమైనో జైల్లో ఉన్నాడన్న విషయం బయటపొక్కేసరికి ఆమె జన్మసంవత్సరాన్ని 1946 కి మార్చారు. పార్లమెంటుకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఆమె జన్మస్థలం ఒర్బస్సానో గా చెప్పబడితే ఆమె బర్త్ సర్టిఫికేట్లో లుసియానా అని ఉంది.
 • విఖ్యాత లండన్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషులో డిప్లొమా చేసినట్లు 2004 రాయ్‌బరేలీ ఎలెక్షన్ అఫిడవిట్‌లో సోనియాగాంధీ పేర్కొన్నారు. అటువంటి పేరుగలిగిన విద్యార్థులెవరూ తమ వద్ద చదువుకోలేదని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం సుబ్రహ్మణ్యస్వామికి లిఖితపూర్వక సమాధానమిచ్చింది. మరోసారి సమర్పించిన ఎలెక్షన్ అఫిడవిట్‌లో సోనియాగాంధీ ఆ ఊసే ఎత్తలేదు. సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టుకి వెళ్తే చీఫ్‌జస్టిస్ "స్వామీ విశాల దృక్పథంతో ఆలోచించండి.ఇది చాలా పాతవిషయం" అన్నారు. నిజానికి సోనియాగాంధీ ఐదవతరగతి కంటే ఎక్కువ చదువుకోలేదు.  కేంబ్రిడ్జి టౌన్లో ఇంటిపనులవీ చేసి డబ్బులు సంపాదించడానికి కావలసినంత ఇంగ్లీషు మాత్రం నేర్చుకున్నారు. 
 • కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని రెస్టారెంట్లో వెయిట్రెస్స్‌గా పనిచేస్తున్న కాలంలో 1965లో మొదటిసారిగా రాజీవ్‌గాంధీనీ కలిసింది సోనియా. చదువులో నెగ్గుకురాలేకపోయిన రాజీవ్ లండన్ వెళ్ళి అక్కడ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరారు . సోనియా కూడా లండన్ వెళ్ళి అక్కడొక దుకాణంలో పనికి కుదిరింది. ఆ దుకాణం దుబాయ్ కేంద్రంగా ఎగుమతి దిగుమతుల వ్యాపారం చేస్తూ, అధికశాతం లండన్లోనే ఉండే సల్మాన్‌ తస్సీర్ అనే ఒక పాకిస్తానీది. ఇలాంటి వ్యాపారాలు చేసేది ISI వాళ్ళే.    
 • ఖరీదైన జీవనశైలి కారణంగా అప్పులు చేయాల్సి వచ్చిన రాజీవ్‌గాంధీకి సోనియా ఆర్థిక సాయం చేసేది. ఆమె పనిచేస్తున్న సంస్థ ద్వారా ఆమెకు పుష్కలంగా డబ్బుముట్టేది. అదే సొమ్ముని రాజీవ్‌గాంధీ అవసరాల కోసం వినియోగించేదామె. రాజీవ్‌గాంధీ చేస్తున్న దుబారాఖర్చుల గురుంచి సుబ్రహ్మణ్య స్వామితో చెప్పుకొని బాధపడింది ఇందిరాగాంధీ. ఆమె మరో కొడుకు సంజయ్‌గాంధీ యాథాశక్తి డబ్బులు పంపిస్తూ అన్నకి అండగా నిలబడేవారు . 
వివాహం - వివాదాస్పద వ్యవహారాలు
 • కాథొలిక్‌గా మారి సోనియాను సీక్రెట్‌గా చర్చిలో వివాహం చేసుకున్నారు రాజీవ్‌గాంధీ. ఇందిరాగాంధీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినా, 'భారత్-రష్యాల మధ్యనున్న ద్వైపాక్షిక సంబంధాలు  దెబ్బతినగూడదన్న' T.N.కౌల్ (రష్యాలో భారతరాయబారి) సలహాకు తలొగ్గి చివరకు అంగీకరించాల్సి వచ్చింది. ఆయన మీద KGB ఒత్తిడి పనిచేసిందన్న సంగతి సుస్పష్టం. సోనియా సామాన్య ఇటలీవనితే అయితే 'ఇరుదేశాలు సంబంధాలు దెబ్బతినకూడదని ' ఒక భారత రాయబారి సిఫార్సు చెయ్యాల్సిన అవసరం ఏమిటి?
 • వివాహమయ్యాక సోనియాగాంధీ ప్రభుత్వరంగ సంస్థైన ఓరియంటల్ ఫైర్ అండ్ ఇన్ష్యూరెన్స్ తరపున ఏజెంట్‌గా పనిచేశారు. ప్రధానమంత్రి ఆఫిసును తన చిరునామాగా పేర్కొంటూ అక్కడ పనిచేసే అధికారులను ఇన్ష్యూర్ చేయించేవారు. ఆమె అప్పటికి భారతీయురాలు కాదు.ఒక ఇటాలియన్ వనితగా ఉంటూ అలా చెయ్యడం ఫెరా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. 19 నవంబరు 1974లో సుబ్రహ్మణ్యస్వామి ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తినప్పుడు పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. ఇందిరాగాంధీ వ్రాతపూర్వకంగా అదంతా నిజమేనని అంగీకరించి ' అది తెలియక చేసిన తప్పిదమని, సోనియా ఇప్పుడా పదవికి రాజీనామా చేశార ' ని తెలిపారు.
 • 1977లో జనతాపార్టీ అధికారంలో కొచ్చింది. సుప్రీంకోర్టు జస్టిస్ A.C.గుప్తా నేతృత్వంలో ఏర్పడ్డ కమీషన్ , అప్పటికి గాంధీ కుటుంబం ఆజమాయిషిలోనున్న మారుతి కంపెనీ  విషయంలో సోనియాగాంధీ ఎనిమిదిచోట్ల ఫెరా నిబంధనలు అతిక్రమించారని ఒక పెద్ద రిపోర్టు తయారు చేసింది. కానీ సోనియాగాంధీ ప్రాసిక్యూట్ చేయబడలేదు. ఇటువంటి కేసులకు కాలపరిమితి లేకపోవటం వల్ల సోనియాను ఇప్పుడు కూడా ప్రాసిక్యూట్ చేయవచ్చు.  
 • 1982లో రాత్రి రెండుగంటల సమయంలో ఢిల్లీ IIT ముఖ్యద్వారం వద్ద దగ్గర జరిగిన ఒక కారు ప్రమాదంలో మాధవరావు సింధియా, సోనియా గాయపడ్డారు. సింధియాతో పాటూ కేవలం సోనియా మాత్రమే కారులో ఉన్నారు. తను హాస్పిటల్‌కి వెళ్ళనని ఆమె మొండికెయ్యటంతో, వారిని కారులోంచి బయటికి లాగిన అక్కడి విద్యార్థి ఆమెను ఆటోలో ఇందిరాగాంధీ ఇంటికి పంపించాడు. సోనియా వెళ్ళిపోయాక రంగప్రవేశం చేసిన పోలీసులు హుటాహుటిన  సింధియాని హాస్పిటల్‌కు తరలించారు.
 • సోనియాగాంధీ గురుంచి కాస్తో కూస్తో తెలిసి అనుమానాలు వ్యక్తం చేసిన అందరూ అనుమానాస్పద ప్రమాదాల్లో మరణించారు. సంజయ్‌గాంధీ, మాధవరావు సింధియా, జితేంద్ర ప్రసాద్, రాజేష్‌ పైలెట్ .. ఇలా అందరూ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయినవాళ్ళే. సంజయ్‌గాంధీ ప్రమాదానికి గురైన విమానంలో  టేకాఫ్ కు ముందే ఇంధనం పూర్తిగా నింపబడిందని ఫ్లైట్ రిజిస్టర్‌లో ఉంది. కానీ ప్రమాదం జరిగాక విమానం పేలిపోలేదు ఎందుకంటే అందులో ఇంధనం లేదు కాబట్టి. మాధవరావు సింధియాతో పాటూ అదే విమానంలో ప్రయాణం చెయ్యవలసిన షీలా దీక్షిత్, మణిశంకర్ అయ్యర్ చివరి నిమిషంలో తమ ప్రయాణాలని వాయిదా వేసుకున్నారు.
 • ఇందిరాగాంధీని సెక్యూరిటీ గార్డులు కాల్చినప్పుడు, ఆమెను మొదట లోహియా అసుపత్రికి  తరలించమని సోనియాగాంధీ పట్టుబట్టారు. అక్కడికి వెళ్ళాక AIIMSకు తరలించమని  మొండికేశారు. 24 నిమిషాల విలువైన సమయం ఇలా వృథా అయ్యింది. 
 • సోనియాగాంధీకి పాలస్తీనాలోని అతివాద హబాష్ గ్రూపుతో సత్సంబంధాలున్నాయి. దాడుల్లో గాయపడిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేదని రాజీవ్‌ గాంధీ, యాసర్ అరాఫత్ సుబ్రహ్మణ్యస్వామికి స్వయంగా చెప్పారు.
 • సోనియాగాంధీకి సద్దాంహుస్సేన్ నుంచి రహస్యంగా నిధులందేవని Reutersలో ఒక కథనం వచ్చింది. 1984 నుంచి ఆమె తన తల్లి పౌలా,సన్నిహితుడు ఒట్టావియో ఖత్రోచి ద్వారా LTTE తో కూడా సంబంధాలు ఏర్పరుచుకొన్నారు. ఖత్రోచి LTTEకి ఆయుధాలు సమకూర్చేవాడు వీరిద్దరి ద్వారా అక్రమ లావాదేవీలు జరిగేవి. సోనియాకు అత్యంత సన్నిహితుడైన అర్జున్‌సింగ్, బెంగుళూరు కేంద్రంగా ఈ వ్యవహారాన్నంతా చక్కబెట్టేవారు .  

 •  ప్రముఖ స్విట్జర్ల్యాండ్ మ్యాగ్‌జైన్  Schweitzer Illustrate  నవంబరు 1991 సంచిక ప్రకారం అప్పటికే రాజీవ్‌ గాంధీ పేరిట స్విస్‌బ్యాంకుల్లో 250 కోట్ల యు.ఎస్ డాలర్లు మూలుగుతున్నాయి. ఆయన మరణాంతరం ఆ సొమ్మంతా సోనియా పరమైనట్లు మ్యాగ్‌జైన్ వెల్లడించింది . ఒక మాఫియా నేత, ఆర్థిక లావాదేవీల విషయమై అమెరికా కూపీలాగి వత్తిడి తెచ్చేసరికి స్విస్ ప్రభుత్వం తన బ్యాంకులలో పెద్ద మొత్తాలలో ధనం దాచుకున్న రహస్య ఖాతాదారుల వివరాలు వెల్లడించవలసి వచ్చింది.ఆ లిస్టులో రాజీవ్‌తో పాటు, సద్దాంహుస్సేన్, ఇండోనేషియా నేత సుహార్తో వంటి ఇతర ప్రముఖులున్నారు. 
 • హార్వర్డ్ నుంచి డాక్టరేట్ పుచ్చుకున్న ఎవ్జీనియా అల్బాట్స్ రష్యాలో ప్రముఖ విద్యావేత్త, జర్నలిస్ట్. KGB వ్యవహారాల దర్యాప్తుకై అప్పటి రష్యా ప్రెసిడెంట్ బోరిస్ ఎల్సిన్ నియమించిన కమీషన్లో్  ఆమె సభ్యురాలు. ఆమె వ్రాసిన పుస్తకం The State Within a State. The KGB in Soviet Union లో సోనియా గాంధీ- KGB మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల గురుంచి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఫైల్‌నంబర్స్‌తో సహా వివరించారు.1992లో రష్యా ప్రభుత్వం ఈ విషయమై వివరణిస్తూ సోవియట్‌ యూనియన్ సైద్ధాంతిక అవసరాల దృష్ట్యా అవన్నీ అవసరమేనని తన చర్యలను సమర్థించుకుంది.
 • సుబ్రహ్మణ్యస్వామి ఆల్బాట్స్‌ను కలిసి ఆమె ఆ డాక్యుమెంట్లను స్వయంగా చూశారని నిర్థారించుకొని, యూనివర్సిటీ లైబ్రరీ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకుని కోర్టులో కేసు వేశారు.అప్పటి మంత్రి వసుంధరరాజే సింధియా  ఆ కేసును దర్యాప్తు చేయమని సి.బి.ఐ ని ఆదేశిస్తే , కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటును స్తంభింపచేసి ఆ ఆదేశాలు రద్దు చేయించారు. రష్యా నుంచి నిజానిజాలు నిర్థారించుకొమ్మని ఢిల్లీ హైకోర్టు  చివాట్లు పెడితే సి.బి.ఐ మూడేళ్ళు కాలయాపన చేసింది. FIR నమోదు చేస్తే రష్యా నుంచి అన్ని ఆధారాలు పొందే అవకాశమున్నా సి.బి.ఐ కానీ, భారత ప్రభుత్వంగానీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.ఈ కేసును ఎప్పుడైనా తిరగదోడే అవకాశముంది.
 • ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రులుగా ఉన్న కాలంలో దాదాపుగా ప్రతీ రోజూ ఢిల్లీ విమానాశ్రాయం నుంచో,చెన్నై విమానాశ్రయం నుంచో భారతదేశ పురాతత్వ సంపద అంతా తరలిపోయేది. ముఖ్యమంత్రిగా కొన్నాళ్ళు, కేంద్రమంత్రిగా కొన్నాళ్ళు పనిచేసిన అర్జున్‌సింగ్ ఈ వ్యవహారాన్నంతా పర్యవేక్షించారు.ఇలా తరలించబడ్డ సంపదనంతా ఇటలీలో సోనియా సోదరి అనౌష్క( అలియాస్ అలెస్సాండ్ర )నిర్వహిస్తున్న ఎత్నిక,గణ్‌పతి అనే రెండు ఆంటిక్‌(Antique) షాపుల్లో ప్రదర్శనకు ఉంచి, తర్వాత నకిలీ బిల్లుల ద్వారా లండన్ పంపించి అక్కడ వేలం వేసి సొమ్ముచేసుకునేవారు. సుబ్రహ్మణ్యస్వామి అభ్యర్థనలని వాజ్‌పేయి ప్రభుత్వం లక్ష్యపెట్టకపోవడంతో ఆయన ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. ఇంటర్‌పోల్, ఇటలీ ప్రభుత్వాల సహాయం తీసుకొమ్మని కోర్టు సి.బి.ఐ ని ఆదేశించింది. ఇంటర్‌పోల్ రెండు భారీ నివేదికలు పంపించింది కానీ వాటిని స్వామికి స్వాధీనం చెయ్యడానికి సి.బి.ఐ నిరాకరించింది. FIR ఫైల్‌చేస్తే సమాచారం అందిస్తామని ఇటలీ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ అది జరగలేదు . ఈ కేసు ఇంకా నడుస్తోంది. 
 • రాజీవ్‌ గాంధీని మట్టుబెట్టడానికి మైనో కుటుంబమే LTTEకి డబ్బు చెల్లించిందని, దానికి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని సంచలనాత్మక అరోపణ చేశారు స్వామి. దీనిపై ఆయనొక పుస్తకం కూడా వ్రాశారు. అప్పటికే స్విస్‌బ్యాంకుల్లో రాజీవ్‌ పేరిట కోట్లాది డాలర్లు మూలుగుతున్నాయి. రాజీవ్‌ కూడా సోనియా వ్యవహారాల పట్ల అసంతృప్తి   వ్యక్తం చేసి వాటికి చెక్‌ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అదే విషయం ఆమెకు చెప్పడంతో ఆయన అడ్డు తొలగించుకోవాలని మైనో కుటుంబం నిశ్చయించుకుంది. రాజీవ్‌ని చంపినా సాక్ష్యాధారాలు దొరకకుండా తాము చూసుకుంటామని, ఆ తప్పుని సిక్కుల మీదో మరొకరి మీదో రుద్దుతామని LTTEకి నమ్మబలికింది. అయితే సి.బి.ఐ అధికారి కార్తికేయన్ సమర్ధంగా వ్యవహరించి సుప్రీంకోర్టులో LTTEని దోషిగా నిరూపించగలిగారు. చంద్రశేఖర్ ప్రభుత్వం నియమించిన జె.ఎస్.వర్మ కమిషన్ శ్రీ పెరంబుదూరు భద్రతా వైఫల్యంలో కాంగ్రెస్‌నాయకుల పాత్ర కూడా ఉందని కనుగొంది. ఈ విషయంపై మరింత లోతుగా అధ్యయనం చెయ్యడానికి అనుమతి కోరితే పీ.వీ.ప్రభుత్వం నిరాకరించింది. సోనియా వత్తిడి మేరకు జైన్ కమీషన్ అని మరోక కమీషన్ నియమించి LTTEని కేసునుంచి తప్పించాలని చూసింది కానీ అప్పటికే ట్రయల్‌కోర్టులో LTTE దోషనిరూపణ జరిగిపోవటంతో ఏమీ చెయ్యలేకపోయింది.  
బోఫోర్స్ గురుంచి


 • ఖత్రోచి ఇటలి దేశపు ఆయిల్,గ్యాస్ కంపెని 'ఏని ' యొక్క ఇంజినీరింగ్ విభాగపు ప్రతినిధి.1974లో మొదటిసారిగా రాజీవ్-సోనియాలను కలిశారు.అప్పటినుంచి రాకపోకలు కొనసాగిస్తూ, అనేక బహుమతులిస్తూ ఆ కుటుంబాన్ని మచ్చిక చేసుకున్నారు. క్రమేపీ వాళ్ళ బంధం ధృడమైపోయి, ఆయన పట్టిందల్లా బంగారమైపోయింది.ఖత్రోచి వస్తే ప్రభుత్వాధికారులు లేచి నిల్చుని మర్యాదలు చేసేవారు. గాంధీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా 1980-1987 మధ్య కాలంలో 60 ప్రాజెక్టులు సాధించుకోగలిగారు.
 • ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోనే ప్రక్రియలో భాగంగా 1984లో శతఘ్నుల టెండర్లను ఆహ్వానించింది భారత సైన్యం.ఫీల్డ్‌లో 29.2 కిలోమిటర్ల రేంజి కవర్ చెయ్యగలిగిన ఫ్రెంచి శతఘ్ని సోఫ్మా సైన్యాన్ని ఆకట్టుకుంది.స్వీడన్ శతఘ్ని బోఫోర్స్ కేవలం 21 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనే బేధించగలిగింది. ఖత్రోచి బోఫోర్స్ ఏజెంటుగా రంగప్రవేశం చేసి అక్రమంగా టెండర్లు మార్పించి ఒప్పందం బోఫోర్స్‌కే దక్కేలా చూశారు. ఇందుకుగాను ఆయనకు ముట్టిన ప్రతిఫలం 70 లక్షల డాలర్లు. 'ది హిందు ' దినపత్రిక విలేకరి చిత్రాసుబ్రహ్మణ్యం బోఫోర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ అర్ద్‌బో ప్రైవేట్ డైరిని సంపాదించటంతో వాస్తవాలు వెలుగు చూశాయి. కొన్నాళ్ళ పాటు కథలు కథలుగా ఈ కుంభకోణాన్ని ప్రచురించిన 'ది హిందు ' దినపత్రిక కాంగ్రెస్ వత్తిడికి తట్టుకోలేక ప్రచురణను నిలిపివేసింది. చిత్రాసుబ్రహ్మణ్యం ' ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ' కు వెళ్ళి అక్కడినుంచి తన పోరాటాన్ని కొనసాగించారు. కుంభకోణం బయటపడిన పదేళ్ళకు గానీ ఖత్రోచి పేరు చార్జిషీటులో చేర్చబడలేదు.1993లో అరెస్టవడానికి సరిగ్గా రెండురోజుల ముందు ఖత్రోచి భరతదేశం వదిలి కౌలాలంపూర్ పారిపోయారు.ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే ఇది సాధ్యపడే పనేనా? కుంభకోణం బయటపడిన పదేళ్ళకు,1999లో బి.జే.పి అధికారంలోకి వచ్చాక గానీ ఖత్రోచి పేరు చార్జిషీటులో చేర్చబడలేదు. సి.బి.ఐ. సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతో ఆయనపై ఉన్న ఆబియోగాలను కోర్టు కొట్టివేసింది. 64కోట్ల ఈ కుంభకోణాన్ని దర్యాప్తు చెయ్యడానికి ఇప్పటి వరకు అయిన ఖర్చు 250 కోట్లు.


2004 నుంచి ఇప్పటివరకు


 • సోనియా గాంధీ ప్రధాని పదవిని వదులుకోవడానికి గల కారణాలు కూడా చెప్పారు స్వామి. భారతీయ పౌరసత్వ చట్టంలోని ప్రొవిషన్ 5 ప్రకారం సోనియా గాంధీ దేశపు అత్యున్నత పీఠం అధిరోహించటానికి వీల్లేదని న్యాయసందేహాలు లేవనెత్తుతూ స్వామి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాంకు ఒక లేఖ వ్రాశారు. సోనియా గాంధీ అప్పటికే 340 ఎం.పి.లు తననే ప్రధానిగా చెయ్యాలని సిఫార్సు చేస్తున్నట్లు లేఖలు పుట్టించారు.(వాటిలో తనను తానే ప్రధానిగా సిఫార్సు చేస్తున్న లేఖ కూడా ఉండటం దివాళాకోరు రాజకీయ హాస్యానికి పరాకాష్ఠ). ఇక రాష్ట్రపతి నుంచి పిలుపు రావటమే తరువాయి అనుకుంటున్న సమయంలో స్వామి ఉత్తరం అందుకుని ఆయనతో భేటియైన కలాం, సోనియాకు ఫోన్‌ చేసి చావుకబురు చల్లగా చెప్పారు. ప్రధానిగా తానే ప్రమాణస్వీకారం చెయ్యాలని పట్టుబడితే ముందు న్యాయపరమైన అంశాలు నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత మరుసటి రోజు తనను కలవొచ్చని చెప్పారు. న్యాయపరంగా వెళ్తే తన ఎంపిక చట్టవ్యతిరేకమవుతుందని గ్రహించిన సోనియా వెనక్కి తగ్గి గత్యంతరం లేని పరిస్థితుల్లో పగ్గాలు మన్మోహన్‌సింగ్‌కు అప్పజెప్పారు.భజనపరులైన మన కాంగ్రెస్ ఎం.పి.లకు విషయం అర్థంగాక కన్నీళ్ళపర్యంతమై ఆమెను అభినవ సీతను, త్యాగశీలిని చేసి ఆకాశానికెత్తేశారు.
 • మన్మోహన్‌సింగ్ ప్రధానయ్యాక అప్పటివరకు ఉన్న రష్యా రాయబారిని వెనక్కి పిలిపించి అతని స్థానంలో 1970ల నాటి ఒక KGB చీఫ్‌ని నియమించింది రష్యా ప్రభుత్వం.
 • 2008లో 2G స్పెక్ట్రం లైసెన్సులను 2001 నాటి ధరలకి అమ్మారు. నిబంధనలు బేఖాతరు చేసి అర్హతలేని కంపెనీలకు కూడా లైసెన్సులు ఇచ్చారు. స్వాన్ టెలికాం, యూనిటెక్ కంపెనీలకు ఈ రంగంలో ముందస్తు అనుభవం లేదు. వాటికీ లైసెన్సులు దక్కాయి. స్వాన్ టెలికాం  45% వాటాను దుబాయ్‌కి చెందిన ఎటిసలాత్‌కు అమ్మింది.ఇది మాఫియా డాన్ దావుద్ఇబ్రహీం అనుచరులది.యూనిటెక్ 60% శాతం వాటాను నార్వేకి చెందిన టెలినార్‌కు అమ్మింది. శివరాజ్‌పాటిల్ మంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీని భారతదేశంలో వ్యాపారం చెయ్యడానికి అనుమతించరాదని కేంద్ర హోంశాఖ ఒక నివేదికను తయారుచేసింది. టెలినార్ తన పరికరాలన్నీ చైనా మిలిటరీ నుంచి కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు లైసెన్సులు టెలినార్ పరమవ్వటం వలన భవిష్యత్తులో భారత్-చైనా మధ్య యుద్ధం సంభవిస్తే, చైనా తన సాఫ్ట్‌వేర్ ద్వారా సైబర్‌వార్‌కు దిగి కంప్యూటర్లను హ్యాక్ చేసే అవకాశాలున్నాయి. (యూనినార్ మొబైల్ వినియోగదారులూ జాగ్రత్త). ప్రధానమంత్రే ఒకటి రెండు సార్లు హెచ్చరించినా, లక్ష్యపెట్టకుండా కేంద్ర హోంమంత్రి చిదంబరం చేత సంతకాలు పెట్టించుకొని లైసెన్సులు జారీ చేసినందుకు రాజాకు ముట్టిన దక్షిణ 7000కోట్ల రుపాయిలు, కరుణానిధికి సమర్పించిన కానుక 15000 కోట్లు, చిదంబరంకు చదివించిన సొమ్ము 5000 కోట్లు. ఇక ముఖ్య కథానాయిక సోనియాగాంధీకి సమర్పించుకున్న చీరా-సారే ఖర్చు 36,000 కోట్లు. సుబ్రహ్మణ్యస్వామి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు ఐదులేఖలు వ్రాశారు. దేనికీ ప్రతిస్పందన రాలేదు. కోర్టులో దావా వేసేసరికి ప్రభుత్వంలో కదలిక వచ్చి తలలు తెగిపడటం మొదలయ్యింది.లైసెన్సుల జారీ ఫైల్‌పై సంతకం పెట్టిన నేరానికి రేప్పొద్దున్న చిదంబరం కూడా జైలుకు వెళ్ళవలసి వస్తే ఆశ్చర్యపోనక్కరలేదు.  
రాహుల్‌ గాంధీ గురుంచి


 • రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరికీ ఇటాలియన్ పాస్‌పోర్టులే ఉన్నాయి. పాస్‌పోర్టులో రాహుల్‌గాంధీ పేరు రౌల్ వించిగా నమోదై ఉంది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నకాలంలో హిందూజా సోదరులు హార్వర్డ్ మెడికల్‌ కాలేజ్‌కు 11లక్షల డాలర్లు దానం చేశారు. అలా దాతల కోటాలో సీటు దక్కించుకున్న రాహుల్ అక్కడున్న పోటీని తట్టుకోలేక మూడునెలల్లోనే వదిలేశారు. సెయింట్ స్టీఫెన్‌ కాలేజ్‌లో తనను క్రైస్తవుడిగా ప్రకటించుకొని, క్రీడాకారుడి(షూటర్) కోటాలో సీటు పొందారు. అయితే హిందీ పరీక్షలో ఫెయిలయ్యారు. రాహుల్‌గాంధీ ఎం.ఫిల్ చదివారని కాంగ్రెస్‌వాదులు చెబుతారు కానీ ఎం.ఫిల్‌కు ముందు ఎక్కడ ఏం చదివారో ఎవరికీ తెలియదు.
 • రాహుల్‌ గాంధీ హార్వర్డ్‌లో ఉన్న కాలంలో ఆయన ఖర్చుల చెల్లింపులన్నీ కేమన్‌ దీవులలోని అకౌంట్ల ద్వారా జరిగాయి.స్విస్‌బ్యాంకు ఖాతాలలాగే వీటికీ గోప్యత ఎక్కువ.
 • 27 సెప్టంబరు 2001న బోస్టన్ విమానాశ్రయంలో రాహుల్‌ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు.అమెరికాలో ప్రవేశించేటప్పుడు పదివేల డాలర్ల కంటే అధికమొత్తంలో ధనం తీసుకువెళ్తూంటే ఆ విషయాన్ని డిక్లరేషన్‌ ఫాంలో ముందే డిక్లేర్ చెయ్యాలి. రాహుల్‌ గాంధీ డిక్లేర్ చెయ్యలేదు.1,60,000 డాలర్లతో తన స్నేహితురాలు వెరోనిక్ కథెలీ సహా దొరికిపోయారు. అతను మాజీ ప్రధాని కుమారుడని మన కమాండోలు విన్నవించుకున్నా FBI ఖాతరు చెయ్యలేదు. తొమ్మిదిగంటల పాటూ వారి కస్టడీలో గడపాల్సి వచ్చింది. చివరికి భారత ప్రభుత్వం స్వయంగా కలుగచేసుకోని కండొలిజా రైస్‌కు పరిస్థితిని విన్నవించి అతన్ని బయటికి తీసుకువచ్చింది. అంత పెద్ద మొత్తం ఆ సమయంలో రాహుల్ దగ్గరెందుకుంది అన్నదాని మీద సరైన సమాధానాలు లేవు. అప్పటి నుంచి రాహుల్‌గాంధీ అమెరికా వెళ్ళిన దాఖలాలు లేవు. అతన్ని ఏ నిమిషమైనా మళ్ళీ పిలిపించుకునే అధికారం FBI కుంది. ఈ కేసు వివరాల కోసం సుబ్రహ్మణ్యస్వామి FBI ని సంప్రదిస్తే, 'ఇది రాహుల్‌ గాంధీ వ్యక్తిగత విషయం కాబట్టి ఆయనకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా పంపిస్తా' మని సమాధానం లభించింది. స్వామి ఎన్నో లేఖలు వ్రాశారు కానీ వేటికీ రాహుల్‌ గాంధీ జవాబివ్వలేదు.
 • రాహుల్‌ గాంధీ గర్ల్‌ఫ్రెండ్ వెరోనిక్ కథెలీ స్పెయిన్ దేశస్థురాలు. ఆమె తండ్రికి కొలంబియన్‌ డ్రగ్‌మాఫియాతో సంబంధాలున్నాయి.19 comments

June 17, 2011 at 10:20 PM

ఇందులో కొన్ని విషయాలు తెలిసినప్పటికీ లెక్కలు తెలీవు. ఇవి అందరికీ తెలియాలి. మంచి పని చేశారు. అభినందనలు.

Reply
June 17, 2011 at 10:55 PM

ఇవన్నీ నిజాలే.. నేను నమ్మలేక పోతున్నాను

Reply
June 18, 2011 at 5:56 AM

ఇవన్నీ ఏదైనా పుస్తక రూపంలో దొరికితే బాగుణ్ణు. Thanks.

Reply

మీడియా కూడా కాంగ్రెస్ కొమ్ము కాస్తున్నందుకే ఈ పచ్చి నిజాలు బయటకు రావడంలేదు.

Reply
June 18, 2011 at 7:00 AM

అందోళన కలిగించేలా ఉంది మీ టపా.
ఈ వుచ్చు నుండి బయటపడగలమా?

Reply

@మందాకిని గారు థాంక్యూ.

@చక్రవర్తి గారు..ఇవన్నీ నిజాలే.కేవలం అరోపణలే అయితే ఇన్ని సంవత్సరాలు కేసులెందుకు నడుస్తాయి?

@Indian minerva గారు, సుబ్రహ్మణ్యస్వామి గారే వలనే అది సాధ్యమవుతుంది.

@చిలమకూరు విజయమోహన్ గారు, సత్యం చెప్పారు,CNN-IBN,NDTV లాంటి ఛానల్స్ ఉన్నంత వరకూ కాంగ్రెస్ కొచ్చిన ఢోకా ఏమీ లేదు.

@శ్రీ గారు,ఈ ఉచ్చు నుండి బయటపడాలంటే సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలి.బి.జె.పి కి మతతత్వ పార్టీ అన్న ముద్రవేశారు కాబట్టి ఆ పార్టీ నిజాలే చెప్పినా ఎవరూ పట్టించుకోరు.సుబ్రహ్మణ్యస్వామి లాంటి వాళ్ళో,అన్నాహజారే లాంటి పౌరసంఘాల ప్రతినిధిలో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి పోరాడాలి.విచక్షణతో సంబంధం లేకుండా చదువుకున్న వాళ్ళలో కూడా సోనియా వీర విధేయులున్నారు.వీళ్ళు వాస్తవాలు బయటపడినా 'ఎవరు చేయట్లేదు,ఇవన్నీ మాములే' అని బుకాయిస్తారు.వాళ్ళ ఆలోచనలలో మార్పు రానంతవరకూ మనకీ అవస్థలు తప్పవు. అందుకే అన్నాహజారే లాంటి వాళ్ళు లోక్‌పాల్ బిల్లు పరిధిలో ప్రధానిని,ఎం.పి.లను కుడా చేర్చాలని పోరాటం చేస్తున్నారు.

Reply
June 18, 2011 at 9:00 AM

బాబోయ్ ----ఇంత విషయసేకరణా?

Reply
June 18, 2011 at 12:15 PM

చదువుతూ వుంటే అయ్య బాబొయ్ అనిపించింది.
మంచి ప్రయత్నం,లోతైన విషయ సెకరణ.
thank you....

Reply
June 18, 2011 at 1:05 PM

ఇవన్ని నిజాలైనా నాయకులు పట్టించికోరు మనం వాళ్ళ పాపాలను ఈ దేశ పౌరులుగా అనుభవించాల్సిందే

Reply
June 18, 2011 at 3:02 PM

హమ్మో! హమ్మో!! ఎంత మాయదారి మైసమ్మ!!
విదేశాంగ మంత్రిగా పనిచేసిన పివి నరసిమ్హారావు గారికి ఈమె చరిత్ర బాగా తెలుసు కాబట్టే, ప్రధానమత్రయ్యాక ఈమె గ్యాంగ్ను దూరం వుంచారు, అందుకేనేమో ఆయన పోయాక కూడా ఆయన్ను సాధించింది.

Reply
June 18, 2011 at 3:03 PM

కఠోరమైన నిజాలు పంచుకున్నారు, ధన్యవాదాలు.

Reply

@ సాంబమూర్తి గారు కృతజ్ఞతలు.

@ రామ్ గారు ధన్యవాదాలు.

@ సూర్యకిరణ్ గారు, ఒక మహిళా జర్నలిస్టు ప్రాణాలకు తెగించి బోఫోర్స్ ఉదంతాన్ని బయటపెట్టారు.ఆమెకున్న నిబద్ధత మన రాజకీయనాయకులకు లేకపోయింది.అదే మన దురదృష్టం.

@ Sknr గారు,నేను కేవలం సుబ్రహ్మణ్యస్వామి గారి వ్యాసాలను, ప్రసంగాలను అక్షరబద్ధం చేశాను. మనమందరం థాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి ఆయన.ఆయన ఒక్కడే దశాబ్దాల నుంచీ న్యాయ పోరాటం చేస్తూ కాంగ్రెస్ పునాదులు కదిలించివేస్తున్నారు.

Reply
June 19, 2011 at 6:59 AM

ఇన్ని నిజాలని ఒక్కసారే తట్టుకోలేకపోతున్నాను. కాస్త సమయం పడుతుంది. మళ్ళీ తీరిగ్గా చదవాలి. థాంక్స్.

Reply
June 19, 2011 at 1:42 PM

లోకేష్ గారు మైండ బ్లాక్ అయ్యే విషయాలు చెప్పారు. ఇవన్ని మన సామాన్య భారతీయులకు తెలిసేది ఎలాగండి..? పాపం వాళ్ళేదో ఈ నాయకులను చూసి ఈ దేశాన్ని వారి జీవితాలనీ ఉద్దరిస్తున్నారనే బ్రమలో బతుకుతున్నారు. మీనుండి ఇటువంటి దేశ సౌర్వబౌమత్వానికి సంబందించిన విషయాలను ఇంకా ఆశిస్తున్నాము. వీలుంటే ఆ సుబ్రమణ్యస్వామి గారి బ్లాగ్ లింక్ ఇవ్వగలరు.
సోనియా గాన్ధి ప్రధాని కాకూండా ఉండడానికి ప్రధాన మూలం సుబ్రమణ్యస్వామి అన్న విషయం నాకు అప్పటికే తెలుసు ఆయన చెప్పిన కొన్ని విషయాలను ఇక్కడ్ చెబుతున్నా..
మన దేశంలో సౌర్వభౌమ అధికారం కేవలం ఒక్క ప్రధానికే వుంటుందన్న విషయం అందరికీ తెలుసు.మన త్రివిధదళాల పైన అధికారం కూడ ప్రధానిదే. అయితే త్రివిద దళాలలో పని చేస్తున్నా ఏ స్థాయి ఉద్యోగి అయినా సరే విదేశీ మహిళను/పురుషుడిని వివాహం చేసుకుంటే వెంటనే వారిని ఉద్యోగం నుండి తొలగిస్తారు. ఈ కారణమం చేత చాలా మంది యువకులు మొదట ఉత్సాహంతో త్రివిదదళాలలో చేరి తర్వాత అక్కడ ఇమడలేక బయటకు రావాలనుకున్నవారు వెంటనే విదేశీ మహిళలతో దొంగ పెళ్ళిల్లు చేసుకొని, ఉద్యోగం నుండి టెర్మినేట్ అయ్యాక ఒప్పందం ప్రకారం ఆ విదేశీ మహిళ/పురుషుడి తో విడాకులు తీసుకుంటారు..మరి ఇలాంటి నిబందనలున్న త్రివిధదళాలపై అధికారం ఒక విదేశీమనిషికి ఎలా అప్పగిస్తారు..? అలాగే మన దేశంలో సౌర్వభౌమ అధికారమ్ గల పదవిని ఒక విదేశీ మనిషికి ఇవ్వాలంటే..! ఆ విదేశీ మనిషి యెక్క దేశంలో కూడ మన దేశానికి చెందిని వ్యక్తికి అంతే స్థాయి గల పదివిని ఇచ్చి ఉండాలి. ఈ ప్రకారంతా చూసుకుంటే ఇటలీ దేశంలో చిన్న కార్పోరేటర్ పదివికి పోటి చేయడానికి కూడ విదేశీయులను అనుమతించరు. మరటివంటి పరిస్థితిలో ఎలా ఇస్తారు ఒక విదేశీయి మహిళకు..? ఈ విషయాన్నే స్పష్టంగా అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారికి సుబ్రమణ్యస్వామి వివరించారు. ఇదే విషయాన్ని కలామ్ గారు సోనియాకు చెప్పారట.. ఈ కారణాల చేతనే ఆవిడ పదవిని ఒదులుకోవాల్సి వచ్చింది.

Reply

@ తొలకరి గారు,నింపాదిగానే చదవండి.కానీ చదవడం మాత్రం మర్చిపోకండి.అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివి

@ కమల్‌గారు,బాగా వివరించారు.జనతాపార్టీ వెబ్‌సైట్‌లో సోనియాకు సంబంధించిన వివరాలు ఇవిగో
http://janataparty.org/sonia.html

యూట్యూబ్‌లో సోనియా ఎక్స్‌పోస్డ్ అని వెదకండి.సుబ్రహ్మణ్యస్వామి గారి ప్రసంగాలు కనిపిస్తాయి.

Reply
June 24, 2011 at 12:02 PM

ఇందులో కొన్ని విషయాలు నమ్మలేక పోతున్నాను...
1) నిజానికి సోనియాగాంధీ ఐదవతరగతి కంటే ఎక్కువ చదువుకోలేదు.(How can She handle theentire country)

2)1982లో రాత్రి రెండుగంటల సమయంలో ఢిల్లీ IIT ముఖ్యద్వారం వద్ద దగ్గర జరిగిన ఒక కారు ప్రమాదంలో మాధవరావు సింధియా, సోనియా గాయపడ్డారు. సింధియాతో పాటూ కేవలం సోనియా మాత్రమే కారులో ఉన్నారు. (What's wrong in that... are they doing Sex?... did any body seen... )

i do accept some comments but don't mis guide every body

Reply

కోటి గారు నేనెవర్నీ మిస్‌గైడ్ చెయ్యటం లేదు.రెండవ సంఘటనలో తప్పేమీ లేకపోవచ్చు.ఆ సంఘటనను సింధియాతో సోనియాకున్న ఫ్రెండ్‌షిప్ గురుంచి చెప్పటానికి మాత్రమే వాడుకోబడింది.ఈ ఉదంతం మీద జనతా పార్టీ వెబ్‌సైట్‌లో సుబ్రహ్మణ్య స్వామి గారు వ్రాసిన వాక్యాలు యథాతథంగా ఇక్కడిస్తున్నాను.

Rajiv was not the only friend Sonia was seeing those days. Madhavrao Scindia and a German by name Stiegler are worth mentioning as other good friends of Sonia. Madhavrao’s friendship continued even after Sonia’s marriage to Rajiv.

Reply
September 12, 2011 at 2:34 AM

Nice Article Lokesh

Reply
March 16, 2012 at 10:41 PM

Sonia Gandhi entire country ni handle chesthonda.. Havva. Aina sonia manage chesedemito Robert vadheraku thelusu. UP lo Haryana lo veella badhithulaku thelusu. Oka nikrustapu party ga congrss marintha digajarindi ee chaduvu rani lokagnanam leni sontha prayojanalaku evarinaina balipette Sonia ki kaka inkevariki vasthayi? Sonia Charitha eppatinuncho erigina sathyame aina mana veera vidheyula rajyam lo adi eppudu bayatakosthundi. Evaraina chepithe danini vakreekarinche Digvijayulu, Renukalu endaru leru congress lo. YSR mathram thakkuva thinnada Koduku chedindi kani lekapothe Sonia kalladaggira janma pavanam chesukoleda

Reply
Post a Comment