ఈ దారుణం విన్నారా? మా చిన్నారి పుణ్యమా అని నాకీ సందేహం కలిగి ఒక నిష్టూర సత్యం బయటపడింది కానీ,లేకుంటే ఈ అన్యాయం కూడా,తరతరాలుగా మగజాతికి జరుగుతున్న వెలుగులోకిరాని అనేక పరాభవాల జాబితాలో చేరిపోయేది.
ఆగాండాగండి..విషయంలోకి వచ్చేస్తున్నాను.
అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటాం.
నాన్నకు అమ్మను నాన్నమ్మ అంటాం.
కానీ అమ్మకు నాన్నైనా,నాన్నకు నాన్నైనా ముక్తసరిగా తాతయ్య అనేసి చేతులు దులుపుకుంటాం.అమ్మలకు రెండు పేర్లుంటే,నాన్నలకు మాత్రం ' తాతయ్య ' అని ఒకే పేరుతో సర్దిపెట్టేశారు.
దీనివల్ల బోలెడంత కష్టం ఉంది.
తాతయ్య అని ఒకరిని పరిచయం చేసి,ఇంకొకరి ఫోటో చూపించి మళ్ళీ తాతయ్య అంటే,మొదటి వ్యక్తి అమ్మకు నాన్నని,రెండో వ్యక్తి నాన్నకు నాన్నని అర్థం చేసుకోవటానికి బుడుగులు,సిగానపెసూనాంబలు ఎంత కష్టపడాలి.అంత చిన్న వయసులో వారి చిట్టి మెదళ్ళని మానసికశ్రమకు గురిచెయ్యడం అవసరమా? తాతలిద్దరిదీ వేర్వేరు ఊర్లయితే,ఏ హైదరాబాద్ తాతనో,తిరుపతి తాతనో చెప్పుకునే వెసులుబాటు ఉంది.అదే ఇద్దరిదీ ఒకే ఊరయితే,అప్పుడేమని పిలవాలి? గాంధీరోడ్ తాతనో, లేక నెహ్రూవీధి తాతనో నా? తాతయ్య గురుంచి చెప్పుకోవాల్సిన ప్రతిసారీ,ఏ తాత గురుంచి చెబుతున్నామో,ఆ విషయం మీద స్పష్టతనివ్వాల్సి రావటం భావ్యమా? వాగానుశాసనుడైన నన్నయ్య కూడా ఈ విషయం పై దృష్టి పెట్టకపోవటం శోచనీయం.
దీనిని నేను ఖండిస్తున్నాను.
అమ్మనాన్న,నాన్ననాన్న అంటే బావుండదు కాబట్టి అర్జంటుగా ఒక ఉద్యమం లాగా 'తాతయ్య ' పదానికి ప్రత్యామ్నాయాలు వెదకాల్సిన అవసరం మనకందరికీ ఉంది.స్త్రీ సమానత్వం,పురుషాహంకారం మీద ఉద్యమాలు నడిపే మహిళాశిరోమణులు కూడా మగజాతికి జరిగిన ఈ అన్యాయాన్ని సావధానంగా పరిశీలించి,మా ఉద్యామానికి సహకరించల్సిందిగా నా విన్నపం.
ఏమంటారు?
Subscribe to:
Post Comments (Atom)
12 comments
I am in the same boat. My daughter is 4 months old and her both her grandparents are based in same place.
ReplyWhat can be the solution?
Sree
according to same situation in prakasam district peternal grandfather called as "jejinayana" .They called only meternal grandfather as tataiah.this system is only in rayalaseema area. i don't know about tengana.
Replyమా రాయలసీమ ఏరియా (కడప,కర్నూల్,అనంతపూర్ ) లో నాన్న నాన్నను అబ్బ అని,అమ్మ నాన్నను తాత అని ,అమ్మ అమ్మను అవ్వ అని ,నాన్న అమ్మను జేజి అని అంటారు.మా వైపు తేడాలు స్పష్టంగా తెలుసు కోవచ్హు.
Reply@confused గారు, కృతజ్ఞతలు
Reply@rameshssbd గారు,ప్రకాశం జిల్లా వ్యవహారిక పదాలు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు
@రమణారెడ్డి గారు కృతజ్ఞతలు.మాది రాయలసీమే.కాకపొతే చిత్తూరు జిల్లా.నాకు తెలిసినంత వరకు మా వైపు ఇద్దరినీ తాత అనే పిలుస్తారు.నాన్నమ్మైనా,అమ్మమ్మైనా,ముత్తవ్వని మావైపు జేజవ్వ అంటారు.అబ్బ అంటే బూతు కింద లెక్క.
మాదీ సీమేనండోయ్! మేము అవ్వ, తాత అనే పిలుస్తాము. మీరన్నట్టు ఊరిపేర్లు తగిలించి అవ్వ,తాత అంటాము. ఒకే ఊర్లో ఉంటే ఆయన పేరు వెనక తాతను తగిలిస్తే సరి.
Replyసీమ లోనే ముగ్గురు మూడు రకాలు చెప్పాం చూశారా!
అమ్మ ను,అక్కను కూడా బూతు పదంగా వాడవచ్హు ,ఎక్కడైనా.అబ్బను మాత్రమే కాదు.మీకు తెలుసనుకుంటాను.
Replyనాది ఇంకోరకపు కన్ఫ్యూజను-మా అమ్మాయి పిల్లలు,అబ్బాయి పిల్లలు ఒకేచోట ఉంటారు. వీళ్ళుకలిసినప్పుడల్లా, ఇద్దరూ 'తాతయ్యా' అనే పిలుస్తారు. వాళ్ళకి అర్ధం అవదు, ఇద్దరికీ ఒకే మనిషి తాతయ్య ఎలా అయ్యాడూ అని!
Reply@మందాకిని గారు కృతజ్ఞతలు.
Reply@రమణారెడ్డి గారు,మీరు చెప్పింది కరెక్టే కానీ,మా వైపు మాత్రం అబ్బ అంటే నాన్న అనే అర్థంతో వాడుతారు.వెటకారంగా చెప్పాల్సినప్పుడో,తిట్టేటప్పుడో అలా అంటారు.
@harephala గారు కృతజ్ఞతలు.
lol..hehe..alaa piliste andaroo bettam pattukuntaaru maa oollo kuda.
Replyayina tatayya bagundi kadandee..oke pilupu nerchukunte iddarinee pilicheyachu ;)
మానస గారు,
Replyఅలా ఒక్క పేరుతో ఎన్ని కష్టాలో చెప్పాను కదా :-)
పైన రమణారెడ్డి గారు చెప్పినట్లు కడప వైపు మాత్రం నాన్న నాన్నని " అబ్బ " అని పిలుస్తారు, నేను ఇప్పటికీ అలానే పిలుస్తాను, ఇక నానమ్మను " జేజి " ఇప్పటికి అలానే పిలుస్తారు..నేను కూడ అంతే..! అమ్మమ్మ ని " అవ్వ " అని..అమ్మ నాన్నని " తాత " అని..ఇలా స్పష్టంగా తేడాలున్నాయి కడప, కర్నూల్ వైపు.
Replyకమల్ గారు,
Replyచిత్తూరు జిల్లా పేరుకు రాయలసీమలో ఉంది కానీ,అక్కడి పలకరింపులు,పట్టింపులు మిగతా మూడు జిల్లాలకు భిన్నంగానే ఉంటాయి.