నా అభిమాన చిత్రకారుల్లో వపా(వడ్డాది పాపయ్య శాస్త్రి) గారొకరు. చిత్రలేఖనం అంటే ఆయిల్‌పెయింటింగ్సే అనుకునే రోజుల్లో వాటర్ కలర్స్‌తోనే అద్భుతాలు సృష్టించి సంచలనం రేపారాయన. ఆంధ్రులందరికీ చిత్రకళ అనగానే బాపుగారే ముందు గుర్తొస్తారేమో కానీ నాకు మాత్రం మొదట పరిచయమైన చిత్రకారుడు వీరే. 'స్వాతి' వారపత్రికకు ఆ పుణ్యం దక్కుతుంది. ఆ పత్రిక కోసం వారు వేసిన కొన్నిచిత్రాలు ఇక్కడ చూడండి.
Subscribe to:
Post Comments (Atom)
5 comments
వడ్డాది పాపయ్య గారి అద్భుతమైన బొమ్మలు అందించినందుకు ధన్యవాదాలు. స్వాతి పత్రికవారు, వారి దగ్గర ఉన్న వ పా గారి బొమ్మలను ఒక సంకలనంగా తీసుకు వస్తే ఎంతైనా బాగుండును.
Replyనాకు కూడా శ్రీ కాంత్ గారూ !వపా గారి చిత్రాలంటే ప్రాణం.బాపు గీత సరళత్వం దాగున్న సౌందర్యం అయితే వపా చిత్రాలు ఆకాశంలో సాగే మేఘ మాలికల లాగా తరిచి చూసే కొద్దీ కొత్త అందాలు తట్టే గీతా రహస్యాలు .నా ఓటు బాపు గారికన్నా ముందు వపా గారికే ! వారి ఎన్నో చిత్రాలు స్లైడ్ షో రూపంలో చూపించిన మీకు ధన్యవాదాలు ఎంత చెప్పినా తక్కువే !
Replyఇదివరకు రెగ్యులర్ గా స్వాతి పుస్తకాలు చదివే వాడిని "సకుటుంబ సపరివార పత్రిక". ధన్యవాదాలు.
Replyఆహా, ఓహో అనని వాళ్ళుంటారాండి? మీరు సేకరించి పెట్టుకున్నారా ఇవన్నీ!
Replyరవివర్మగారికొచ్చిన పేరు ప్రఖ్యాతులకు వడ్దాది పాపయ్యగారూ అర్హులైన వారే కదా!
ఆయన చాలా నిరాడంబరులని ఒకసారి చందమామ బ్లాగులో చదివాను.
శివగారు అవునండి.వేమూరి బలరాంగారు ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకుంటే బావుంటుంది.
Replyకర్లపాలెం హనుమంతరావు గారు థాంక్యూ.
సుదర్శన్ గారు నెనర్లు.
మందాకిని గారు,ఇవన్నీ మా నాన్నగారు సేకరించి పెట్టుకున్నవి.ఎప్పుడో 1985-86 కాలం నాటి చిత్రాలు.అప్పటికి నేనింకా బుడ్డొడ్నే లెండి.వపా గారు చాలా నిరాడంబరులు.మద్రాసులో సెటిల్ అయ్యుంటే ఆయన పేరు మారుమ్రోగిపోయేది.కానీ కశింకోటలో స్థిరపడినట్లు గుర్తు.