ఆయన నాకు సీనియర్.మంచి ఒడ్డు పొడవు.చూడ్డానికి హీరోలా ఉంటాడు.కాలేజ్‌లో ఉన్నప్పుడే మోడలింగ్ చెయ్యాలని కలలు కనేవాడు.యాక్టర్ కాకపోయుంటే డాక్టర్ అయ్యేవాళ్ళమని తారలు చెప్పే కబుర్లు చెప్పాల్సిన అవసరం తనకి లేదు.ఎందుకంటే తను నిజంగా డాక్టరే .విదేశాల్లో ఎం.బి.బి.యస్ పూర్తి చేశాక హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో వైద్య వృత్తిని నిర్వహిస్తూ తన ప్రయత్నాలు కొనసాగించాడు. హాస్పిటల్‌కు వచ్చే సినీపరిశ్రమకు చెందిన వ్యక్తుల కళ్ళల్లో పడటంతో అతని పంటపండి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.మొదట్లో కొన్ని వేషాలు వేసినా జగపతిబాబు హీరోగా వచ్చిన సిద్ధం అతనికి మంచి గుర్తింపునిచ్చింది.కమలహాసన్, వెంకటేష్, మోహన్‌లాల్ లాంటి ప్రముఖ నటులతో కలిసి పని చేసే అదృష్టం వరించింది. (ఈనాడు, ఈనాడు తమిళ్ వెర్షన్ ఉన్నైపోల్ ఒరువాన్ ). మంచి నటుడిగా మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు అక్కినేని నాగార్జున నటించిన గగనం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
గగనం గురుంచి ప్రత్యేకంగా చెప్పటానికి ఒక కారణం ఉంది.అక్కినేని నాగార్జున తన అభిమాన కథానాయకుడు. చిన్నప్పుడు ఏ హీరో చిత్రాల కోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూశాడో, క్యూలైన్లో నిలబడి ఎగబడి చూశాడో అదే హీరో పక్కన తనూ ప్రధాన పాత్రలో నటించే అవకాశం రావటం సామాన్యమైన విషయం కాదు. వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో వర్ణించే ఉదాహరణలకు ఏ మాత్రం తీసిపోని పరిణామక్రమం ఇది. ప్రతిభ,పట్టుదల ఉంటే ఆకాశమే హద్దనే విషయాన్ని భరత్‌రెడ్డి మళ్ళీ నిరూపించాడు.
Hats off to him and wishing him all the best in his future endeavors