గదంతా మాకు తెల్వద్
మా తెలంగాణా మాగ్గావాలె,
హైద్రాబాద్ మాగ్గావాలె,
పదేళ్ళ హైద్రాబాద్ ఆదాయం మాగ్గావాలె,
ఉద్యోగాలు మాగ్గావాలె,
ప్యాకేజి మాగ్గావాలె,
భద్రాచలం మాగ్గావాలె,
గోదావరి మాగ్గావాలె
కృష్ణా మాగ్గావాలె
మచిలీపట్నం ఓడరేవు మాగ్గావాలె
శ్రీశైలం మాగ్గావాలె
అది గావాలె, గిది గావాలె, అన్నీ గావాలె,
విద్యుత్‌కొరత మాత్రం సీమాంధ్ర తీర్చాలె !!
4 comments
అదేదే కథలో... పక్కవాడికి ఏదిస్తే దానికి రెట్టింపు ఇవ్వాలని దేవుడిని కోరుకుని రెండు కళ్ళూ పొగొట్టుకున్నవాడిచందాన ఉంది తెలంగాణవాదుల వరస.
Replyతేజస్వి గారు,
Replyమీ స్పందనకు కృతజ్ఞతలు.తెలంగాణా నేతల గొంతెమ్మ కోర్కెలకు అంతూ పొంతూ లేకుండా ఉంది.1956 ముందు తెలంగాణా కావాలంటారు.మళ్ళీ భద్రాచలం కావాలంటారు.అదేమిటంటే మళ్ళీ భద్రాచలం రెండో గుండెకాయ అంటారు.రెండు గుండెకాయలు మనుషులకు ఉంటాయా ? ఒకప్పటి నైజం పాలనలో భద్రాచలం భాగమంటారు. ఆదే నైజాం ఆధీనంలో సీమాంధ్ర ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా అంటే దానికి సమాధానం ఉండదు. వాళ్ళు చెప్పిందే చరిత్ర. ఒక్క రాజకీయ నాయకుడూ గట్టిగా నిలదీసి ,న్యాయం మాట్లాడకపోవటం సీమాంధ్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం.
హైదరాబాద్ భద్రాచలంతో కూడిన తెలంగాణా ఏర్పడటం ఖాయం!వేచి చూడండి!ఎవ్వరూ ఆపలేరు!
Replyసూర్యప్రకాశ్ గారు,
Replyమీ స్పందనకు కృతజ్ఞతలు.' వడ్డించే వాడు ' మనవాడైతే అన్న సామెత ప్రకారం ప్రస్తుతం విభజన జరుగుతోంది. తెలంగాణా నేతల డిమాండ్లన్నీ కోరిందే తడవుగా తీర్చేస్తున్నారు. సీమాంధ్రుల గోడు పట్టించుకునేవాడు లేడు.ఇది అశాస్త్రీయమైన విభజన.