ప్రతిసారీ సంక్రాంతి పండక్కి తిరుపతి వెళ్ళడం రివాజు.భోగిమంటలు తిరుపతిలోనో,లేదా మా తాతయ్య వాళ్ళ పల్లెటూరులోనో వేస్తాం.ఈ సారి వీలు కుదరలేదు.దాంతో భోగిపండుగ బెంగుళూరులోనే జరుపుకుందాం అని నేను మా ఆవిడ నిర్ణయించుకున్నాం.
ప్రొద్దున్నే ఐదున్నరకి లేచి ముందే పోగుచేసుకున్న కార్టన్ బాక్సులు,కొబ్బరిపీచుతో చేసిన డోర్ మాట్లు చేతబట్టుకొని వీధిలోకి వచ్చాం.బెంగుళూరులో జరుపుకోవటం మొదటిసారి కావటంతో మాకు ఉత్సాహంగానే ఉంది.వీధిలో తెలుగువాళ్ళు చాలా మందే వున్నా ఎవరూ లేచి భోగిమంటలు వేసిన ఆనవాళ్ళు లేవు.మేము మంట వేస్తూంటే జాగింగ్ వేళ్ళేవాళ్ళు,మార్నింగ్ వాక్ వెళ్ళేవారు,పాలవాళ్ళు వింతగా చూసుకుంటూ వెళ్ళిపోయారు.ఇంకొంతమంది మేమేంచేస్తున్నామా అని కిటికీల్లోంచి కుతూహలంగా చుశారు.మాకు తోడుగా మంటలు ఎవరైనా వెస్తారేమోనని చుశాం కానీ ఎవరూ వెయ్యలేదు.నగరవాసం దాన్ని నామోషి పనిగా మార్చివేసిందేమో తెలియదు.
మొత్తానికి ఈ భోగి ఒక కొత్త అనుభూతిని మిగిల్చింది.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
9 comments
బెంగుళూరు నగరంలోనే కాదండి మా తాడిపత్రి పట్టణంలో కూడా మా పరిస్థితి అదే.
Replyసంక్రాంతి శుభాకాంక్షలు .
Replyసంక్రాంతి శుభాకాంషలు.భోగిమంటలు పల్లెటూరులో మజాగా ఉంటాయి. నగరంలో అక్కడి భిన్న సంస్కృతుల వాతావరణంలో అవి తేలిపోతాయి. ఏ వస్తువు భాసించాలన్నా, అనువైన పరిస్థితులు కావాల్సిందే. మొన్న 3 వ తారీకున లాల్ బాగ్ లో బెంగలూరు బ్లాగర్ల సమావేశం జరిపాము. తదుపరి ఫిబ్రవరి 21 న జరిగే సమావేశానికి హాజరుకాగోరుతాను. మీకు ఆహ్వానం పంపటానికై మీ చిరునామా, టెలిఫోన్ సంఖ్య తెలియపరస్తూ నాకు ఒక జాబు రాయగలరు.
Replyఅవునండి వింతగా చూస్తారు భోగి మంట వేస్తే :(
Replyసంక్రాంతి శుభాకాంక్షలు :)
సంక్రాంతి శుభాకాంక్షలు
ReplyC B Rao gaaru,
Replyplease inform me.
I am also from Bangalore.
chala manchi pani chesaru.manma okkalame anukokandi .next year kuda tappakunda veyyandi.tappakunda andaru vashtaru.
Replyhappy bhogi
ఎలాగైతేనేం.. మొత్తానికి భోగి మంట వేసేసుకుని పండగ జరుపుకున్నారన్నమాట :)
Replyమీకూ, మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు.
Sarat & Bonagiri: బెంగలూరు బ్లాగర్ల సమావేశం ప్రతి నెలా మూడవ ఆదివారం ఉంటుంది. ఆహ్వానం కొరకై మీరు ఈ కింది వివరాలు నాకు పంపగలరు.
Replyబ్లాగు పేరు
బ్లాగు చిరునామా
మీ e మైల్ చిరునామా
మీ టెలిఫోన్ సంఖ్య