వినడానికి అద్భుతంగా ఉండి చిత్రీకరణలో తేలిపోయిన ఎన్నో పాటల్లో ఇదొకటి. లిరిక్ విని పాట ఇలా తీసుంటారని అలా తీసుంటారని ఏదేదో ఉహించుకున్నాను.పల్లవి విని ఇదేదో కథానాయకుడు ఆవేదనతో పాడే పాటేమోననుకున్నాను. చరణాలు విన్నాక ' కాదు ఇది హీరో తన భావావేశాన్నే హృద్యంగా వెల్లబుచ్చే పాట ' అనుకున్నాను.అప్పటికి నేనీ సినిమా చూడలేదు. అయితే హీరోయిన్ భానుప్రియ అని,దర్శకుడు వంశీ అని తెలుసు. హీరో మోహన్ అని మాత్రం తెలీదు. పాట బాగా నచ్చడంతో చాలా సార్లు మళ్ళీ మళ్ళీ విన్నాను. విన్న ప్రతిసారీ కథానాయకుడి మన:స్థితిని పొంది ఒక తియ్యని అనుభూతికి లోనయ్యాను.
మొన్నామధ్య తేజ టీ.వి లో ఈ సినిమా వస్తూంటే ఆత్రంగా చూశాను. పది నిమిషాలయ్యేసరికి సినిమా నిరుత్సాహాన్ని కలిగించింది. వంశీ లాంటి భావుకుడు కూడా అంత చప్పగా పాటను ఎలా తీశారా అని అనిపించింది. పాటలో ఉన్న గాఢతను తెర మీద ప్రతిఫలించటంలో ఆయన విఫలమయ్యారు. తర్వాత చూడలేక ఛానల్ మార్చేశాను.
ఈ పాటకు సంగీతం ఇళయరాజా. సాహిత్యం వేటూరి. ఇందులో మొదటి చరణంలో వేటూరి భావసౌందర్యం చూడండి
వేటూరి ఇంటిపేరుని 'పాటూరి' గా మార్చినా తప్పులేదేమో. అంత అపుర్వమైన పాటలు వ్రాశారాయన.

అల పైట వేసే సెలపాట విన్నా( సెలయేరు వేగంగా ప్రవహిస్తున్నప్పుడు ఉప్పొంగి ఎగసే అలలు దానికి పైటలాగా ఉన్నాయట. పర్వతం ఒక వీణయితే,అ పర్వతం పైనుంచి దూకే జలపాతం ఆ వీణకున్న తంత్రి అట.అలతి పదాలలో ఎంత అద్భుతమైన భావం ఇమిడ్చారో చూశారా ! )
గిరి వీణ మీటే జలపాతమన్నా
నాలోన సాగే ఆలాపన(గళమధువులన్నది ఇంకో మంచి ప్రయోగం)
రాగాలు తీసే ఆలోచన
ఝరుల గమన నాట్యం
అరవిరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలో
గళమధువులడిగే గానం
నిదురలేచే నాలో హృదయమే
వేటూరి ఇంటిపేరుని 'పాటూరి' గా మార్చినా తప్పులేదేమో. అంత అపుర్వమైన పాటలు వ్రాశారాయన.
3 comments
వంశి మంచి రచయిత ఆలాపన తీసేనాటికి ఇంకా పూర్తి స్థాయి పరిపక్వత రాలేదు..
Replyఅందుకే ఆ సినిమా అల్లా ఉండి మంచి కధ కధనం మాత్రం అంత బాగుండదు
పుస్తక రచన మొదట్లో కన్నా ఇప్పుడు బాగుంటే
సినిమాలు మొదట్లో బాగుండి ఇప్పుడు నాణ్యత లోపిస్తున్నై
ఎందుకో ఈ అనులోమ విలోమాలు.... వంశి గారికి...
aahhhh..I completely agreee..
Replykonni paatalu vinadaaniki enta goppagaa anipistaayo, chooste anta nirutsaahaanni kaligistaayi.
Vamsi usual gaa songs baane direct chestaadu kaani, appudappudu ivi tappavemo mari.. :)
Lyrics are brilliant as u said..
ఆత్రేయ గారు,మానస గారు కృతజ్ఞతలు
Reply