మొన్నా మధ్య బాబాయ్ వరుస బంధువొకరు పని మీద బెంగుళూరు వచ్చి కొన్నిరోజులున్నారు. ఉత్తినే తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏటుంటది అనుకున్నారేమో,పనైపోయాక ఓ సాయంకాలం ఖాళీగా ఉంటే, చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయి బ్రిగేడ్ రోడ్, ఫోరం లాంటి ప్రదేశాలు చుట్టేసి ఈసురోమంటూ కాళ్ళీడ్చుకుంటూ వచ్చారు.వచ్చిన దగ్గర్నుంచీ ఒకటే రుస రుస.సంగతేమిటా అని ఆరా తీస్తే public display of love and affection అట.అంటే బహిరంగంగా ప్రేమను ప్రదర్శించటం అన్నమాట.
మా బంధువు కొంచెం పాతకాలం మనిషి. స్త్రీ, పురుషుల మధ్య ఉండే రొమాంటిక్ రిలేషన్ ఏదైనా ఇంటి నాలుగ్గోడల మధ్య ఉండాలి గానీ అందరికీ బహిర్గతమవ్వకూడదని ఆయన ప్రగాఢ విశ్వాసం. మన సంస్కృతి మనకు గుట్టుని నేర్పిందని, అనాది నుండి అదే మన జీవన విధానమని ఆయన గట్టి నమ్మిక. అందరి ముందు గట్టిగా వాటేసుకోవటం, ముద్దులు పెట్టుకోవటం మన నాగరికత కాదని, పాశ్చాత్య పోకడలన్నీ వచ్చి మనదేశాన్ని బ్రష్టుపట్టిస్తున్నాయని ఆయన వాపోతారు. బహిరంగ ప్రదేశాల్లో కపుల్స్ ఎవరైనా ఒకరి నడుముల మీద మరొకరు చేతులు వేసుకొని సినిమాల్లో హీరో హీరోయిన్లలా కలల్లో తేలిపోతున్నట్టు తదాత్మ్యంతో నడుస్తూంటే ఆయన ఆశ్చర్యంతో నోరువెళ్ళబెడతారు. సన్నిహితంగా ఎవరైనా కనిపిస్తే ఊపిరిబిగబట్టేసి హైరానా పడిపోతారు. 'వీళ్ళందరికీ ఇదేం పోయేకాలం.ఈ వేషాలేవో ఇంటిదగ్గర వేయచ్చుగా? ఇలా అందరుముందూ నగుబాటు కావడం ఎందుకు' అని విసురుకుంటారు.
"ఇందులో తప్పేముంది? మీ జనరేషన్ వేరు. ఈ జనరేషన్ వేరు. ఇప్పుడంతా స్పీడ్‌యుగం. మీకాలంలో ఉన్నట్లు నెమ్మదిగా శాంతంగా ఉండమంటే ఎలా సాధ్యం? ఆలుమగలయితే మాత్రం అందరి ముందు అంటీ అంటనట్లు ఉండాలా? టీనేజ్ ప్రేమికులే వొళ్ళుపై తెలియకుండా తిరుగుతున్నారు. ఆలుమగలు చేతులు పట్టుకుంటే తప్పేమిటి? ఎవరో ఏదో అనుకుంటారని భార్యాభర్తలు బయట ఎడమొహం పెడమొహంగా ఉండాలా? వాళ్ళేమీ నేరం చెయ్యటం లేదు కదా?" అని నా స్నేహితుడు అడిగితే గయ్యుమంటూ ఇంతెత్తున పైకి లేచారు . "టీనేజ్‌లో ఉన్నవాళ్ళకి యుక్తాయుక్త విచక్షణ ఉండదు. తల్లితండ్రులకి తెలియకుండా చాటుగా తిరుగుతూంటారు కాబట్టి, థ్రిల్ల్ కోసమో, మరి దేనికోసమో అలా చేస్తూండవచ్చు.ఆలుమగలు అలా కాదు కదా. వాళ్ళు చట్టబద్ధంగా ఒక్కటైన వాళ్ళు. నువ్వు నీ భార్యతో అన్యోన్యంగా ఉన్నావన్న విషయం నీ భార్య గుర్తిస్తే చాలు. ప్రపంచం అంతా గుర్తించాల్సిన పని లేదు. అది వాళ్ళకు అనవసరం కూడా. ఇంట్లో ఏనాడూ అప్యాయత చూపని నువ్వు, బహిరంగ ప్రదేశాలలో భార్యపై వాలిపోయి ఉపయోగమేమిటి? ఇదంతా వొఠ్ఠి నటన. అశాశ్వతం.పీడాకారం సినిమాలు చూసి వాటిని అనుకరించే ప్రయత్నమే కానీ అందులో నిజాయతీ ఏది. భార్యని నిజంగా ప్రేమిస్తూ ,ఆమె గౌరవాన్ని కోరుకునేవాడు ఇలా నలుగురి దృష్టి ఆమె మీద పడేలా చేస్తాడా?" అని దబాయించారు.నా స్నేహితుడు కూడా తన వాదనలు వినిపించాడు.నేను మౌనంగా వింటూ కూర్చున్నాను.
ఆయన వెళ్ళిపోయిన కొన్ని రోజులకి నా మిత్రుడు మళ్ళీ తారసపడాడ్డు. మాటల సందర్భంలో నవ్వుతూ ఒక విషయం చెప్పాడు. అతని భార్య ఫేస్‌బుక్, ఆర్కుట్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ తరచుగా చూస్తుందట. విదేశాల్లో స్థిరపడిన ఆవిడ స్నేహితురాళ్ళు ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు తమ భర్తలను గట్టిగా వాటేసుకొనో లేక, ముద్దులు పెట్టుకుంటూనో ఫోటోలు తీసుకొని వాటిని గర్వంగా షేర్ చేస్తుంటారట. అవి చూసిన ప్రతిసారి ఇతని భార్య కూడా మీరెప్ప్పుడైనా అలా రొమాంటిక్‌గా నాతో ఫోటోలు దిగారా? కనీసం పబ్లిక్‌గా భార్యమీద చెయ్యైనా వేశారా అని వేళాకోళం చేసేదట. మొదట్లో సరదాగా తీసుకున్న నా మిత్రుడు,భార్య నిజంగానే బాధపడుతోందేమోనని అనుమానించి ఒకరోజు బజార్లో నడిచి వెళ్తూంటే ఆమె భుజం మీద చెయ్యి వేశాడట. అతని భార్య తెగ కంగారుపడిపోయి ' ఏమిటా రౌడీ వేషాలు, ఎవరైనా చూస్తే బావోదు. చెయ్యి తియ్యండి ' అని కసిరిందట.
నాకు నవ్వాగలేదు.

4 comments
:)
Replyనాకు నవ్వాగటంలేదు :)))
Replybavundandi andi
Replyశిశిర గారు,రాజేష్ గారు,సత్య గారు కృతజ్ఞతలు
Reply