(దాదాపు ఇరవైయేళ్ళ క్రితం మా నాన్నగారు వ్రాసిన కొన్ని భావగీతాలు ఆకాశవాణిలో వచ్చేవి. వాటిలో నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఇదొకటి.)
రాగం పలికింది -నాలో
అనురాగం వొలికింది
|| రాగం పలికింది
విరుల సరులలో తురీరవములో
ఝరుల వగలులో గిరుల నగవులో
అంతులేని ఆనందలహరిలో
పొంగి పొరలు రసతరంగిణియై
|| రాగం పలికింది
శరదిందుచంద్రికా చిద్విలాసమున
విరిగంధ వీచికా విరహతాపమున
మదన మనోహర మోహనాట్యమున
చిందులేయు చెలి అందెల రవళియై
|| రాగం పలికింది
రాగం పలికింది -నాలో
అనురాగం వొలికింది
|| రాగం పలికింది
విరుల సరులలో తురీరవములో
ఝరుల వగలులో గిరుల నగవులో
అంతులేని ఆనందలహరిలో
పొంగి పొరలు రసతరంగిణియై
|| రాగం పలికింది
శరదిందుచంద్రికా చిద్విలాసమున
విరిగంధ వీచికా విరహతాపమున
మదన మనోహర మోహనాట్యమున
చిందులేయు చెలి అందెల రవళియై
|| రాగం పలికింది
6 comments
మీ నాన్నగారు ఆకాశవాణికి రచించిన పాట రసవత్తరంగా ఉంది!
Replyసూర్య ప్రకాశ్ గారు,
Replyమీ స్పందనకు కృతజ్ఞతలు.
nice one
Replyకొత్తపాళీ గారు,
Replyథాంక్యూ.
"శరదిందు చంద్రికా.." పదప్రయోగం బాగుందండీ..ఆడియో లేదా మీ వద్ద?
Replyమానస గారు,
Replyకృతజ్ఞతలు.ఆడియో క్యాసెట్ రూపంలో ఉంది. దాన్ని convert చెయ్యాలి.