ఉపోద్ఘాతంమెరిసే మేఘాలు
కురిసే వర్షాలు
విరిసే పుష్పాలు 

మురిసే భువనాలు 
నాకు కదిలే కావ్యాలు !

ఇది నా కవితల పుస్తకానికి నేను వ్రాసుకున్న ఉపోద్ఘాతం ..1 comment

Post a Comment

ప్రేరణ
నాకు ఈ మాత్రం సాహిత్యాభిలాష అబ్బిందంటే దానికి కారణం మా నాన్న గారే !

నాన్న గారు స్వతహాగా కవి,రచయిత,చిత్రకారుడు,రంగస్థల నటుడు.వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగైనా ప్రవృత్తులను ఆయన ఏనాడు అలక్ష్యం చెయ్యలేదు.వారు వ్రాసిన ఎన్నో గేయాలు,నాటికలు ఆకాశవాణి,దూరదర్శన్ లో ప్రసారం అయ్యాయి.'రుక్మిణీ కళ్యాణం' అనే పద్యనాటిక, అవధాన చక్రవర్తి,శతావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ ,శతాధిక నాటకకర్త,నాటక నవరత్నం కొడాలి గోపాలరావు వంటి ప్రముఖుల మన్ననలను పొంది జన బాహుళ్యంలో మంచి ప్రాచుర్యం తెచ్చి పెట్టింది.సారా వ్యతిరేక ఉద్యమం ఉద్దృతంగా ఉన్న రోజుల్లో 'సారసుర సంహారం' అనే నాటిక వ్రాసి అనేక ప్రదర్శనలు యిచ్చి చిత్తూరు జిల్లా కలెక్టర్ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకొన్నారు.ఎయిడ్స్ మహమ్మరి మీద వారు వ్రాసిన 'దర్పణం'
నాటిక 2002 లో చిత్తూరు జిల్లా నుంచి చాలా కాలం తర్వాత నంది నాటక పోటీలకు ఎంపికైన నాటకం గా సంచలనం సృష్టించింది.ప్రజారోగ్యం,పర్యావరణం మీద కూడా ఆయన ఎన్నో గేయాలు,పద్యాలు వ్రాశారు.ప్రముఖ వైద్య నిపుణుల సహకారంతో,అరోగ్య ప్రాధాన్యాన్ని వివరిస్తూ తేటగీతి పద్యాలతో 'అరోగ్యగీత' అనే పుస్తకాన్ని వ్రాశారు.

ఆ పరిమళం, సహజంగానే పిల్లలైన మాకు కూడా కాస్తొ కూస్తొ అబ్బింది.నాకు వీలైనంతలో అన్ని పుస్తకాలు చదవడానికి ప్రయత్నించాను.ఆ క్రమం లొ నాకు నచ్చిన కవులు శ్రీ బమ్మెర పోతన,శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి మరియు శ్రీశ్రీ.3 comments

Post a Comment