సిగలో అవి విరులో

పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో,రమేష్‌నాయుడు స్వరకల్పనలో,అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ,జయప్రద నటించిన మేఘసందేశం  చిత్రం లోనిది.భావకవితాప్రవక్త దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యాన్నందించిన ఆఖరి చిత్రం కూడా ఇదే.ఆయన వ్రాసిన మూడు గేయాలను ఈ చిత్రంలో వాడుకున్నారు(మిగాతా రెండూ-ఆకులో ఆకునై,శీతవేళ రానీయకు).దురదృష్టవశాత్తూ ఈ చిత్రం విడుదలకు ముందే ఆయన పరమపదించారు .

ఈ పాట వింటే ముందుగా ట్యూన్ అనుకొని తర్వాత సాహిత్యం వ్రాసినట్లనిపిస్తుంది .అద్భుతమైన బాణీకి,మధురమైన సాహిత్యం తోడైతే,వీనులవిందైన గాత్రం దాన్ని అజరామరం చేస్తుంది.గాంధర్వగాత్రంతో తనవంతు బాధ్యతను సమర్థవంతంగా పోషించారు కే.జే.యేసుదాస్.

సువాసనలు వెదజల్లటం పువ్వుల ధర్మం.అవి శక్తివంతమైనవి.సుకుమారమైనంత మాత్రాన వాటిని తీసిపారెయ్యటానికి వీలు లేదు.దేవుళ్ళ దగ్గర్నుంచి దుర్మార్గుల వరకు ఎవరిని ప్రసన్నం చేసుకోవాలన్నా పువ్వులు తప్పనిసరి.అంతటి శక్తివంతమైనవి కాబట్టే వాటినే బాణాలుగా మన్మథునికి కట్టబెట్టి లోకకార్యాన్ని నిర్వర్తిస్తున్నారు త్రిమూర్తులు . ఇప్పుడంటే తలలో పువ్వులు పెట్టుకోవటం నామోషీగా భావిస్తున్నారు కానీ,నిండుగా తలలో పువ్వులు పెట్టుకున్న స్త్రీమూర్తిని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.ఆ స్త్రీమూర్తి భార్య అయితే,అది తొలిరేయైతే అంతకంటే చెప్పేదేముంది.సరిగ్గా అటువంటి సందర్భమే ఈ చిత్ర కథానాయకుడికీ ఎదురయ్యింది .

అతను భావావేశం కలిగిన ఒక ఉపాధ్యాయుడు.అసలే కవి.పైగా పెళ్ళైయ్యింది.గదిలో ఎదురుగా చక్కని చుక్కలాంటి భార్య సిగ్గుపడుతూ నిల్చుని ఉంది.జడలో పెట్టుకున్న మల్లెపువ్వులు, అగరుధూమాల సువాసనను,అత్తరుల ఘుమఘుమలను జ్ఞప్తికి తెస్తూ
అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అంతే ! అతనిలో ప్రణయానురాగాలు పెల్లుబుకి ఒక మధురగీతాన్ని అందుకున్నాడు.సిగలో అవి విరులో
అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో
మసలే వలపు తొలకరులోఒకదానిమీద ఒకటి పేర్చినట్లు దొంతరలు కట్టిన ఆమె సిగ్గు,వలపు తొలకరి జల్లులా ఉందట.తొలకరి వర్షం మనసుకి ఆహ్లాదాన్నిస్తుంది. కమ్మని మట్టివాసన వెదజల్లుతూ కురిసే చిరుజల్లులో తడవాలంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు? ఇక్కడ నాయిక సిగ్గు కథానాయకుడికి తొలకరిలా ఉందట.ఒట్టి తొలకరికాదండోయ్ వలపు తొలకరిలా .మాములు చిరుజల్లులకే మనం మైమరిచిపోతాం.ఇక ప్రేమతో నిండిన తొలకరి అయితే... అది అనుభవించాల్సిందే కానీ చెప్పశక్యం కాదు.ఎదుట,నా ఎదుట,ఏవో సోయగాల మాలికలు
మదిలోన, గదిలోన, మత్తిలిన కొత్త కోరికలు
నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా
నిలువనీవు నా తలపులు
నీ కనుల ఆ పిలుపులు ||సిగలో


గదిలో కట్టిన మాలికలు గమ్మత్తుగా ఉంటే,ఎదుట ఉన్న నాయిక సోయగాలు ఏకంగా అతని మదిలోనే మాలికలు కట్టేసుకొని కొత్తకోరికలు రేపుతూ  అతని తలపులు నిలువనీయటం లేదట.జరిగి, ఇటు వొరిగి, పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అరవిడిన, చిగురాకు పెదవులను మరిగి
మరలి రాలేవు నా చూపులు మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులు
మధువుకై మెదలు తుమ్మెదలు  ||సిగలో


ఒకప్పుడు ప్రతి చిత్రంలోను భావుకత ప్రాధాన్యతున్న పాటలుండేవి.రాను రాను వాటి సంఖ్య తగ్గి ఇప్పుడు దాదాపుగా మృగ్యమైపోయాయి.ఇటువంటి పాతపాటలు వింటూంటే తెలుగు సినిమా పాటకు మళ్ళీ ఆ రోజులు వస్తాయా అనిపిస్తుంది .


4 comments

Post a Comment

తెలంగాణ పేరుతో ఎన్నాళ్ళీ దొంగనాటకాలు ?
సోదరభావంతో తెలంగాణ కోసం శాంతియుతంగా పోరాడుతున్న గద్దర్ లాంటి వాళ్ళకి ఈ వ్యాసం వర్తించదు.ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ తెలంగాణ పేరుతో అనేక అరాచకాలకు తెగబడుతున్న మూర్ఖశిఖామణుల కోసమే ఈ వ్యాసం .

చాలించడి మీ దొంగ ఏడుపులు పెడబొబ్బలు.
ఎన్నాళ్ళీ దొంగనాటకాలు?
అడిగేవాడు లేక మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.

తెలుగుభాషా వికాసానికి, సంస్కృతికి ఎనలేని సేవ చేసిన ప్రముఖుల విగ్రహాలు కూల్చెయ్యటానికి మీకు మనస్సెలా వచ్చింది? శాంతియుత ప్రదర్శన అంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి మీరు సాధించిన ఘనకార్యం ఇదా? ఇలా చేస్తే తెలంగాణ వచ్చేస్తుందని ఏ అజ్ఞాని మీకు చెప్పింది.ప్రజల అంగీకారం ఉంటేనే ఏ ఉద్యమమైనా ఫలప్రదమవుతుంది.మీరు చేసిన పనికి తెలంగాణలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందే.దీన్ని ఎలా సమర్ధించుకుంటారు? మీరు చేసేది ఉద్యమమా దౌర్జన్యమా? అన్నమయ్య మిమ్మల్ని ఏం చేశాడు? మిమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూసి,మీ మానప్రాణాలతో ఆట్లాడుకొని,మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిచంపిన నైజాం నవాబు మీకు దైవ సమానుడా? మీ రక్త మాంసాలను పీల్చిపిప్పి చేసిన పటేల్‌ పట్వారి వ్యవస్థను ఒక్క కలంపోటుతో రద్దు చేసిన ఆంధ్రుడు NTR మీకు ఆగర్భశత్రువా? విగ్రహాలతో మాకు సమస్య లేదు,విగ్రహాలను పెట్టించినవాడితోనే సమస్య అని ఒక బ్లాగరు అన్నాడు. అదే NTR పెట్టించిన తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు ఎందుకు వదిలేశారు ? అప్పుడు మీకు NTR ఆంధ్రత్వం గుర్తురాలేదా? మీకు చేతనైతే తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకొని సొమ్ముచేసుకున్న మర్రి చెన్నారెడ్డి విగ్రహాలని బ్రద్దలుకొట్టుకోండి కానీ తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన అమరజీవి పోట్టీశ్రీరాములు విగ్రహాలని కాదు. మీది తెలుగు భాష కాదా? ఈ మాటలనడానికి మీరు ఏ మాత్రం సిగ్గుపడటం లేదా? నిన్న మొన్న వచ్చిన నవాబుగిరీలు, ముల్కీలు మీకు ప్రియమైపోయాయి కానీ ఏనాడో శాతవాహనులు స్థాపించి, రుద్రమ్మదేవి ఏలిన అచ్చమైన తెలుగు భాష మీకు చేదైపోయిందా? అందుకేనా మూలాలు మరచిపోయి తెలుగుతల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసారు? ఆఖరికి దేవుళ్ళకు కూడా ప్రాంతీయ తత్వాన్ని(భధ్రాచలం,తిరుమల) ఆపాదించిన ఒక మూర్ఖుడి మాటలు మీకు శిరోధార్యమవుతున్నాయంటే మిమ్మల్ని చూసి మీరే జాలిపడాలి.

ఎవరయ్యా మీకు పాఠాలు చెప్పింది ?
ఏ విశ్వవిద్యాలయం మీకు పట్టాలిచ్చింది ?


మాట్లాడితే రెచ్చగోడుతున్నారు అంటున్నారు
ఎవరిని ఎవరిని రెచ్చగొడుతున్నారు ?

  • పార్టీ పెట్టింది మొదలు అంధ్రులు దొంగలు దోపిడీదారులని ఆడిపోసుకున్నది కేసీయార్ కాదా ?
  • ఆంధ్రావాళ్ళను తరిమికొడతాం అని చిందులు తొక్కింది కేసీయార్‌కాదా ?
  • సీమాంధ్ర కళాశాలలు,వాణిజ్య సముదాయాల పై దాడులకు తెగబడింది మీరు కాదా?
  • వాల్యూయేషన్‌కి వచ్చిన సీమాంధ్ర ఉపాధ్యాయులపై భౌతిక దాడులకి తెగబడింది మీ విద్యార్థులు కాదా? ఈ సంఘటన జరిగిన తర్వాత సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ ఉపాధ్యాయులుకు శాలువాలతో సన్మానం చేసింది వాస్తవం కాదా ?
  • సీమాంధ్ర కళాకారుల మూవీ షూటింగ్స్ సెట్స్ ధ్వంసం చేసింది మీరు కాదా?
  • సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడికి దిగింది మీరు కాదా ?
  • సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేసింది మీరు కాదా ?

  • సీమాంధ్ర నేతలు కేవలం తెలంగాణ రాదంటే రెచ్చగొడుతున్నారు అంటారు మరి మీరు చేసిన నిర్వాకాలని ఏమని అనాలి ?

సీమాంధ్రులు మిమ్మల్ని దోచుకుతిన్నారు అంటారు. శ్రీకృష్ణ కమిటీ ప్రకారం తెలంగాణ కంటే అన్ని రకాలుగా వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ.కానీ మీరు దాన్ని విశ్వసించరు.కోదండరాం,కేసియార్ మాటలు మీకు వేదమంత్రాలతో సమానం. ఇంతకాలం మేం మిమ్మల్ని దోచుకుతిన్న మాట నిజమే అయితే మీరు ముందుగా తిరగబడాల్సింది ఇన్నేళ్ళుగా మీరెన్నుకున్న ప్రజాప్రతినిధుల పైన. వాళ్ళేమీ నోరూ వాయి లేని వాజమ్మలు కాదే.నోట్లో వేలు పెడితే చప్పరించడం కూడా రాని చంటి పిల్లలు కారే ? వేలు పెడితే వెన్నమూక వరకూ దిగమింగే రకం. సుబ్బరంగా సంపాదించుకుని కోట్లు గడించుకొన్నారు కదా? మీరెన్నుకున్న ఎంపీలు కేసియార్,విజయశాంతి నిన్న మొన్నటిదాకా ఎనాడైనా పార్లమెంటు మొహం చుశారా? రాత్రంతా తాగి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయ్యటం తప్ప కేసియార్ ఎమైనా వెలగబెట్టాడా? ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ్డాడా? రాజీనామా డ్రామాలు మొదలుపెట్టి ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని మళ్ళీ ఎన్నికైతే 'తెలంగాణా వాదం యొక్క తీవ్రత ' అంటూ మీరు మురిసిపోయారు కానీ ఎప్పుడైనా ఇందులో మర్మం గ్రహించారా? ఎంతసేపూ విద్యార్థులే ఎందుకు త్యాగాలు చేసి తన్నులు తినాలి, మీరెందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి మీ నైతికత నిరూపించుకోరు అని ఎప్పుడైనా కోదండరాంను నిలదీశారా? ఆయన, ఆయనతో పాటు విద్యార్థులను రెచ్చగొడుతూ నెల తిరిగేసరికి సీమాంధ్రులు కూడా సక్రమంగా పన్నులు కడితే తప్ప విడుదలవ్వని జీతాలను పుచ్చుకుంటున్న ఇతర మేధావులు త్యాగాలకు అతీతులా ? క్లాసులు సక్రమంగా జరక్క విద్యార్థులు,వ్యాపారం జరక్క వ్యాపారస్తులు ,రోజు గడవక బడుగుజీవులు నాశనమైపోవచ్చు కానీ వీళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను వదలరా? నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కావచ్చు,పాలమూరు సమస్య కావచ్చు, సమస్య ఏదైనా పోరాడి సాధించుకోవల్సింది మీరు మీ ప్రజాప్రతినిధులు.ఇంతకాలం ఈ మేధావులు, సంఘసంస్కర్తలు ఏం చేసారు? చోద్యం చూశారా లేక చేతకాక మిన్నకున్నారా? జయప్రకాష్ నారాయణ లాంటి బలహీనుల్ని కోట్టారు కాబట్టి సరిపోయింది కానీ అదే ఏ బలవంతుడైన నేత మీదో చెయ్యిపడుంటే ఆరోజే మీ సామర్థ్యం బయటపడేది. మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే మీ దివాళాకోరు నాయాకులపై తిరగబడండి. ఆడలేనమ్మ మద్దెల మీద పడి ఏడ్చినట్లు మీలో ఇన్ని లోపాలు పెట్టుకొని సీమాంధ్రుల మీద ఏడిస్తే ఏమిటి ప్రయోజనం ?


34 comments

Post a Comment