రాగం పలికింది

(దాదాపు ఇరవైయేళ్ళ క్రితం మా నాన్నగారు వ్రాసిన కొన్ని భావగీతాలు ఆకాశవాణిలో వచ్చేవి. వాటిలో నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఇదొకటి.)రాగం పలికింది -నాలో 
అనురాగం వొలికింది
                                                 || రాగం పలికింది 

విరుల సరులలో తురీరవములో
ఝరుల వగలులో గిరుల నగవులో
అంతులేని ఆనందలహరిలో
పొంగి పొరలు రసతరంగిణియై
                                                || రాగం పలికింది  

శరదిందుచంద్రికా చిద్విలాసమున
విరిగంధ వీచికా విరహతాపమున
మదన మనోహర మోహనాట్యమున
చిందులేయు చెలి అందెల రవళియై

                                                 || రాగం పలికింది   


6 comments

June 24, 2013 at 8:58 AM

మీ నాన్నగారు ఆకాశవాణికి రచించిన పాట రసవత్తరంగా ఉంది!

Reply

సూర్య ప్రకాశ్ గారు,

మీ స్పందనకు కృతజ్ఞతలు.

Reply
June 24, 2013 at 8:26 PM

nice one

Reply

కొత్తపాళీ గారు,

థాంక్యూ.

Reply
June 27, 2013 at 4:01 PM

"శరదిందు చంద్రికా.." పదప్రయోగం బాగుందండీ..ఆడియో లేదా మీ వద్ద?

Reply

మానస గారు,

కృతజ్ఞతలు.ఆడియో క్యాసెట్ రూపంలో ఉంది. దాన్ని convert చెయ్యాలి.

Reply
Post a Comment