శాలివాహన (వాటర్ పెయింటింగ్)


ఆంధ్రుల తొలి తెలుగు రాజులు శాతవాహనులు.ఆయితే వీళ్ళెవరనేదాని మీద బోల్డంత గందరగోళం ఉంది.శాలివాహనుడు విక్రమాదిత్యున్నే ఓడించిన రాజని ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది.మన పురాణాల ప్రకారం శాలివాహనుడు విక్రమాదిత్యుని మనవడు, అగ్నివంశపు రాజు.విదేశీ చరిత్రకారుల ప్రకారం గౌతమీపుత్ర శాతకర్ణే శాలివాహనుడు.కొంతమంది స్వదేశీ చరిత్రకారులు దీనితో విభేదిస్తారు.అయితే ఇంద్రదత్తమైన సింహాసనం పొంది,భేతాళున్ని వశం చేసుకున్న విక్రమాదిత్యుడెవరు అనేదానిమీదే చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు.
అటువంటప్పుడు అతన్ని ఓడించి శక శకానికి శ్రీకారం చుట్టిన శాలివాహనుడెవరో తెలుసుకోవడం కష్టం.వీళ్ళు ఎవరైనా ఆంధ్రజాతికి వీళ్ళే మొదటి తెలుగు పాలకులన్నది సుస్పష్టం.

ఆ శాలివాహనుడి ఊహాచిత్రమే ఈ చిత్రం.


3 comments

August 1, 2010 at 9:17 PM

శ్రీకారం కథ బాగా వ్రాశారండీ!
ముఖ్యంగా పరమాత్ముని వర్ణన చాలా బాగుంది.
ఆముక్త మాల్యద ఆవిర్భావం గురించి తెలిపే ఈ కథ మీరు ఎక్కణ్ణించి స్వీకరించారో తెలుప గలరా!
ఏమీ అనుకోరుగా ఇలా అడిగానని.

Reply
July 25, 2011 at 3:14 PM

చాలా బావుంది!

Reply
January 8, 2012 at 7:13 AM

బాగుందండీ!

Reply
Post a Comment