తెలంగాణ పేరుతో ఎన్నాళ్ళీ దొంగనాటకాలు ?
సోదరభావంతో తెలంగాణ కోసం శాంతియుతంగా పోరాడుతున్న గద్దర్ లాంటి వాళ్ళకి ఈ వ్యాసం వర్తించదు.ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ తెలంగాణ పేరుతో అనేక అరాచకాలకు తెగబడుతున్న మూర్ఖశిఖామణుల కోసమే ఈ వ్యాసం .

చాలించడి మీ దొంగ ఏడుపులు పెడబొబ్బలు.
ఎన్నాళ్ళీ దొంగనాటకాలు?
అడిగేవాడు లేక మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.

తెలుగుభాషా వికాసానికి, సంస్కృతికి ఎనలేని సేవ చేసిన ప్రముఖుల విగ్రహాలు కూల్చెయ్యటానికి మీకు మనస్సెలా వచ్చింది? శాంతియుత ప్రదర్శన అంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి మీరు సాధించిన ఘనకార్యం ఇదా? ఇలా చేస్తే తెలంగాణ వచ్చేస్తుందని ఏ అజ్ఞాని మీకు చెప్పింది.ప్రజల అంగీకారం ఉంటేనే ఏ ఉద్యమమైనా ఫలప్రదమవుతుంది.మీరు చేసిన పనికి తెలంగాణలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందే.దీన్ని ఎలా సమర్ధించుకుంటారు? మీరు చేసేది ఉద్యమమా దౌర్జన్యమా? అన్నమయ్య మిమ్మల్ని ఏం చేశాడు? మిమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూసి,మీ మానప్రాణాలతో ఆట్లాడుకొని,మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిచంపిన నైజాం నవాబు మీకు దైవ సమానుడా? మీ రక్త మాంసాలను పీల్చిపిప్పి చేసిన పటేల్‌ పట్వారి వ్యవస్థను ఒక్క కలంపోటుతో రద్దు చేసిన ఆంధ్రుడు NTR మీకు ఆగర్భశత్రువా? విగ్రహాలతో మాకు సమస్య లేదు,విగ్రహాలను పెట్టించినవాడితోనే సమస్య అని ఒక బ్లాగరు అన్నాడు. అదే NTR పెట్టించిన తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు ఎందుకు వదిలేశారు ? అప్పుడు మీకు NTR ఆంధ్రత్వం గుర్తురాలేదా? మీకు చేతనైతే తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకొని సొమ్ముచేసుకున్న మర్రి చెన్నారెడ్డి విగ్రహాలని బ్రద్దలుకొట్టుకోండి కానీ తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన అమరజీవి పోట్టీశ్రీరాములు విగ్రహాలని కాదు. మీది తెలుగు భాష కాదా? ఈ మాటలనడానికి మీరు ఏ మాత్రం సిగ్గుపడటం లేదా? నిన్న మొన్న వచ్చిన నవాబుగిరీలు, ముల్కీలు మీకు ప్రియమైపోయాయి కానీ ఏనాడో శాతవాహనులు స్థాపించి, రుద్రమ్మదేవి ఏలిన అచ్చమైన తెలుగు భాష మీకు చేదైపోయిందా? అందుకేనా మూలాలు మరచిపోయి తెలుగుతల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసారు? ఆఖరికి దేవుళ్ళకు కూడా ప్రాంతీయ తత్వాన్ని(భధ్రాచలం,తిరుమల) ఆపాదించిన ఒక మూర్ఖుడి మాటలు మీకు శిరోధార్యమవుతున్నాయంటే మిమ్మల్ని చూసి మీరే జాలిపడాలి.

ఎవరయ్యా మీకు పాఠాలు చెప్పింది ?
ఏ విశ్వవిద్యాలయం మీకు పట్టాలిచ్చింది ?


మాట్లాడితే రెచ్చగోడుతున్నారు అంటున్నారు
ఎవరిని ఎవరిని రెచ్చగొడుతున్నారు ?

  • పార్టీ పెట్టింది మొదలు అంధ్రులు దొంగలు దోపిడీదారులని ఆడిపోసుకున్నది కేసీయార్ కాదా ?
  • ఆంధ్రావాళ్ళను తరిమికొడతాం అని చిందులు తొక్కింది కేసీయార్‌కాదా ?
  • సీమాంధ్ర కళాశాలలు,వాణిజ్య సముదాయాల పై దాడులకు తెగబడింది మీరు కాదా?
  • వాల్యూయేషన్‌కి వచ్చిన సీమాంధ్ర ఉపాధ్యాయులపై భౌతిక దాడులకి తెగబడింది మీ విద్యార్థులు కాదా? ఈ సంఘటన జరిగిన తర్వాత సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ ఉపాధ్యాయులుకు శాలువాలతో సన్మానం చేసింది వాస్తవం కాదా ?
  • సీమాంధ్ర కళాకారుల మూవీ షూటింగ్స్ సెట్స్ ధ్వంసం చేసింది మీరు కాదా?
  • సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడికి దిగింది మీరు కాదా ?
  • సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేసింది మీరు కాదా ?

  • సీమాంధ్ర నేతలు కేవలం తెలంగాణ రాదంటే రెచ్చగొడుతున్నారు అంటారు మరి మీరు చేసిన నిర్వాకాలని ఏమని అనాలి ?

సీమాంధ్రులు మిమ్మల్ని దోచుకుతిన్నారు అంటారు. శ్రీకృష్ణ కమిటీ ప్రకారం తెలంగాణ కంటే అన్ని రకాలుగా వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ.కానీ మీరు దాన్ని విశ్వసించరు.కోదండరాం,కేసియార్ మాటలు మీకు వేదమంత్రాలతో సమానం. ఇంతకాలం మేం మిమ్మల్ని దోచుకుతిన్న మాట నిజమే అయితే మీరు ముందుగా తిరగబడాల్సింది ఇన్నేళ్ళుగా మీరెన్నుకున్న ప్రజాప్రతినిధుల పైన. వాళ్ళేమీ నోరూ వాయి లేని వాజమ్మలు కాదే.నోట్లో వేలు పెడితే చప్పరించడం కూడా రాని చంటి పిల్లలు కారే ? వేలు పెడితే వెన్నమూక వరకూ దిగమింగే రకం. సుబ్బరంగా సంపాదించుకుని కోట్లు గడించుకొన్నారు కదా? మీరెన్నుకున్న ఎంపీలు కేసియార్,విజయశాంతి నిన్న మొన్నటిదాకా ఎనాడైనా పార్లమెంటు మొహం చుశారా? రాత్రంతా తాగి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయ్యటం తప్ప కేసియార్ ఎమైనా వెలగబెట్టాడా? ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ్డాడా? రాజీనామా డ్రామాలు మొదలుపెట్టి ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని మళ్ళీ ఎన్నికైతే 'తెలంగాణా వాదం యొక్క తీవ్రత ' అంటూ మీరు మురిసిపోయారు కానీ ఎప్పుడైనా ఇందులో మర్మం గ్రహించారా? ఎంతసేపూ విద్యార్థులే ఎందుకు త్యాగాలు చేసి తన్నులు తినాలి, మీరెందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి మీ నైతికత నిరూపించుకోరు అని ఎప్పుడైనా కోదండరాంను నిలదీశారా? ఆయన, ఆయనతో పాటు విద్యార్థులను రెచ్చగొడుతూ నెల తిరిగేసరికి సీమాంధ్రులు కూడా సక్రమంగా పన్నులు కడితే తప్ప విడుదలవ్వని జీతాలను పుచ్చుకుంటున్న ఇతర మేధావులు త్యాగాలకు అతీతులా ? క్లాసులు సక్రమంగా జరక్క విద్యార్థులు,వ్యాపారం జరక్క వ్యాపారస్తులు ,రోజు గడవక బడుగుజీవులు నాశనమైపోవచ్చు కానీ వీళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను వదలరా? నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కావచ్చు,పాలమూరు సమస్య కావచ్చు, సమస్య ఏదైనా పోరాడి సాధించుకోవల్సింది మీరు మీ ప్రజాప్రతినిధులు.ఇంతకాలం ఈ మేధావులు, సంఘసంస్కర్తలు ఏం చేసారు? చోద్యం చూశారా లేక చేతకాక మిన్నకున్నారా? జయప్రకాష్ నారాయణ లాంటి బలహీనుల్ని కోట్టారు కాబట్టి సరిపోయింది కానీ అదే ఏ బలవంతుడైన నేత మీదో చెయ్యిపడుంటే ఆరోజే మీ సామర్థ్యం బయటపడేది. మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే మీ దివాళాకోరు నాయాకులపై తిరగబడండి. ఆడలేనమ్మ మద్దెల మీద పడి ఏడ్చినట్లు మీలో ఇన్ని లోపాలు పెట్టుకొని సీమాంధ్రుల మీద ఏడిస్తే ఏమిటి ప్రయోజనం ?


34 comments

March 13, 2011 at 4:53 PM

ఇప్పుడు తెలంగానా ఇమ్మంటున్నారు. అది ఇచ్చిన తరువాత కేంద్రం నుండి నిదులు రావట్లేదు, అభివృద్ది జరగడం లేదు ప్రత్యేక దేశం కావాలంటారు.

Reply
Anonymous
March 13, 2011 at 9:10 PM

Don't worry; let this rogue agitation turn violent, it will be crushed with Iron fists

Reply
March 14, 2011 at 2:19 AM

బాగా అడిగారండి..జయప్రకాశ్ నారాయణ్ అసలేమి అనకుండానే కొట్టారుగానీ, అసెంబ్లీ లో మాకు సమైక్య రాష్ట్రమే కావలి అన్న ఒవేసీ ని కొట్టడం కాదు అస్సలు ఒక్క మాట అయిన అనగలిగార అండి ఇప్పటివరకు....జేపీ అంటే మంది మార్బలం లేని వాడు కాబట్టి అయన మీద దాడి చేసారు గాని ఒవేసీ ని ఒక్క మాట అన్న అంటే...హైదరాబాద్ లో మల్లా తిరగానిస్తారా అని నా అనుమానం.

Reply
Anonymous
March 14, 2011 at 7:11 AM

/ఒవేసీ ని కొట్టడం కాదు అస్సలు ఒక్క మాట అయిన అనగలిగార అండి ఇప్పటివరకు..../
వాణ్ణనే ధైర్యమా వీళ్ళకి?!! విగ్రహాలు కాదు కదా వూరికే పడివుండటానికి? బట్టలిప్పి టాంక్బండ్ మీద బహిరంగంగా బతుకమ్మ ఆడిస్తాడు అని వీళ్ళకూ భయమే. :P
హైద్రాబాద్తో సహా తెలంగాణ విడిపోతే జరగబోయేది అదే అనితెలిసే వాణ్ణి మంచి చేసుకోవడానికి నిజాం గొప్ప ప్రభువు, మేమంతా రజాకార్ల సంతానం, బట్టలేకుండా బతుకమ్మ ఆడటం మా అదృష్టం అని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఐనా ఈ తెలబాన్లు ఆ తాలిబాన్ల హృదయాలను కదిలించలేక పోయారు. ఆడూ సమైఖ్యాంధ్ర అనే అన్నాడు, కవ్విస్తూ.. :D

Reply
March 15, 2011 at 1:45 PM

పార్టీ పెట్టింది మొదలు అంధ్రులు దొంగలు దోపిడీదారులని ఆడిపోసుకున్నది కేసీయార్ కాదా?
-
కాదు. దొంగలు అనగానే భుజాలు తడుముకుంటే లోపం ఎక్కడుందో ఆలోచించుకోవాలి మీరే.
-----------------------------

ఆంధ్రావాళ్ళను తరిమికొడతాం అని చిందులు తొక్కింది కేసీయార్‌కాదా ?
-
కాదు. పైన చెప్పిన జవాబే మళ్ళీ వర్తిస్తుంది.
---------------------------
సీమాంధ్ర కళాశాలలు,వాణిజ్య సముదాయాల పై దాడులకు తెగబడింది మీరు కాదా?
-
కాదు. అలా దాడులే నిజంగా చేసే ఉద్దేశం ఉంటె ఇక్కడ నిజంగా మీ వ్యాపారలు ఉంటాయా, మీరు ఉంటారా? ద్రోహులు, అక్రమార్జనాలు చేసిన కబ్జాదార్ల మీదనే దాడులు జరుగుతాయి. అవి చూసి అభద్రతా భావానికి గురయితే అది మా తప్పు కాదు.
-----------------------

వాల్యూయేషన్‌కి వచ్చిన సీమాంధ్ర ఉపాధ్యాయులపై భౌతిక దాడులకి తెగబడింది మీ విద్యార్థులు కాదా? ఈ సంఘటన జరిగిన తర్వాత సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ ఉపాధ్యాయులుకు శాలువాలతో సన్మానం చేసింది వాస్తవం కాదా ?
--
ఎవరికీ ఏమి జరగాలో అదే జరిగింది. తెలంగాణా కాగితాలు కనపడగానే వ్రుత్తి ధర్మం మరచి వివక్షతో దిద్దితే వ్రుత్తి ఆ గురవాన్ని కోల్పోతుంది. మా వాళ్లకు ఆ కపటం లేదు కాబట్టి లోకమంతటా పూజింప బడతారు.
------------------------
సీమాంధ్ర కళాకారుల మూవీ షూటింగ్స్ సెట్స్ ధ్వంసం చేసింది మీరు కాదా?
--
చేయలేదు. కొందరు అతి వాదుల పైనే. వారు ఇక్కడి మట్టి నమ్ముకొని, ఇక్కడ ఉండి, ఇక్కడి వారిని ఆదిపోసుకున్తుంటే ఎదిరించడం అనివార్యం అయ్యింది.
---------------------------------
సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడికి దిగింది మీరు కాదా ?
కాదు. తెలంగాణా ని అడ్డుకునే వారు అందరూ విరోదులే. వారు మీ కపట ప్రజా ప్రతినిదులవడం కాకతాళీయం.
---------------------------------
సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేసింది మీరు కాదా ?
కాదు. ధ్వంసం చేయించింది మీ వాడే. టీ జీ వెంకటేష్ కిరాయి గుండాలు చేసిన పని.
-------------------------------
సీమాంధ్ర నేతలు కేవలం తెలంగాణ రాదంటే రెచ్చగొడుతున్నారు అంటారు మరి మీరు చేసిన నిర్వాకాలని ఏమని అనాలి ?
ఆకలి పోరాటం అనాలి.

Reply
March 15, 2011 at 2:42 PM

ఏదో జయ ప్రకాష్ గారిని కొట్టిన్ల్లు ,టాంక్బండ్ కాదా విగ్రహాలు ద్వంసం చేసిన్ల్లు అని అంటున్నారే మీరు అది అసలు తెలంగాణా పోరాటం లో భాగం కాదు దీన్ని మేమే ఖండిస్తున్నాము .ఏది కొందరు దుర్మార్గులు చేసిన పని .పెద్దల విగ్రహాలను ద్వంసం చేసి అవమాన పరిచారు ఏది ముమ్మాటికి తప్పే.
కానీ సిమంధ్ర నాయకులు 50 సంవత్సరాలుగా చేస్తున్నది ఏంటిది మీకు తెలియదా? ప్రతి రంగం లో మాకు చిన్నచూపే .
కృష్ణ నది నుండి ఏరియా విస్ గ చేస్తే తెలంగాణా నుండి 69 %రాయలసీమ 18%
ఆంధ్ర 13% కానీ మాకు లభించేది 1 % లోపే దొరుకుతుంది ఏది అన్యాయం కాదా .గత ఏళ్ళ నుంచి సిమంధ్ర పాలకులు మా తెలంగాణా ప్రజల రక్తం తాగుతున్ల్లు .
మా ప్రతి గ్రామంలో కనీస అవసర్ల్లేక మేము పడే కస్టాలు నేకు ఎం తెలుసు ? ప్రతి ప్రాజెక్ట్లు మీ సిమంధ్ర వైపే మాకు ఎం చేసి పెట్టారు చెప్పండి మా ప్రాంతం లో స్చోల్లు కాలేజీ లు అని తక్కువనే బతకమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి మంచిగుండది "వేలు పెడితే వెన్నమూక వరకూ దిగమింగే రకం" మని నువ్వు అన్నావు అది ఎవరో మీకు తెలియదా సిమంధ్ర మంత్రులు నరబక్షకులు .ఇలాగే కొనసాగించుటే మా తెలంగాణా మరో ఎడారిగా మారుతుంది తప్పు మాటలు మాట్లాడి నను రేచ్చాగోత్తకు మక్కెలు ఎరాగాదీసి నరాలు మేడల వేసుకుంట బిడ్డ

Reply

@చాలా బాగా గారు,
@Snkr గారు,
@ప్రబంధ్‌చౌదరి గారు
ధన్యవాదాలు

Reply

రాజు గారు,

మీ గ్రామాల్లో కనీస అవసరాలు లేకపోతే దానికి సీమాంధ్రులు ఎలా కారణమవుతారు? సీమాంధ్రలో కూడా ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి.వాటికి కారణం సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కానీ తెలంగాణ వారవుతారా? తలసరి ఆదాయం ( హైదరాబాద్ లేకుండా)తెలంగాణలో 25237 రుపాయిలైతే ( హైదరాబాదు తో కలిపి 27006),కోస్తాంధ్రలో 26655,రాయలసీమలో 23860.2008-09 నాటికి కోస్తాంధ్రలో 60.6 శాతానికి సాగునీటి లభ్యత ఉంటే,రాయలసీమలో 25.3 శాతం,తెలంగాణలో 50.4 శాతం.ఈ లెక్కన తెలంగాణ కంటే రాయలసీమ వెనుకబడి ఉంది.
చారిత్రక భౌగోళిక కారణాలెన్నో దీనికి కారణం.నా టపాలోనే చెప్పినట్లు మీకు ఇన్ని సంవత్సరాలు నిజంగానే అన్యాయం జరిగి ఉంటే ముందు అందుకు కారణమైన మీ ప్రజాప్రతినిధుల మక్కెలు ఇరగతన్ని వాళ్ళ నరాలు మెళ్ళో వేసుకోండి.మీ పులివేషాలకు భయపడేవాళ్ళు ఎవరూ లేరు.

Reply

Anarchist గారు,
నా స్పందన ఇది


1.దొంగలు అనగానే భుజాలు తడుముకుంటే లోపం ఎక్కడుందో ఆలోచించుకోవాలి మీరే. పైన చెప్పిన జవాబే మళ్ళీ వర్తిస్తుంది.

జ.సీమాంధ్రులు దొంగలని స్పష్టంగా అన్నాక దానికి స్పందిస్తే అది భుజాలు తడుముకున్నట్లా? ఎవరో కొంతమంది ద్రోహం చేశారే అనుకొందాం.మీరు జనరలైజ్ చేసి అందరినీ ఎందుకు తిడతారు?2.అలా దాడులే నిజంగా చేసే ఉద్దేశం ఉంటె ఇక్కడ నిజంగా మీ వ్యాపారలు ఉంటాయా, మీరు ఉంటారా? ద్రోహులు, అక్రమార్జనాలు చేసిన కబ్జాదార్ల మీదనే దాడులు జరుగుతాయి. అవి చూసి అభద్రతా భావానికి గురయితే అది మా తప్పు కాదు.

జ.ఎంతటి ఉదారత ? సీమాంధ్ర వ్యాపారాలు మూతపడితే వాటిని నమ్ముకున్న వేలాదిమంది తెలంగాణ ప్రజలు రోడ్డున పడి మీపైనే తిరగబడుతారని మౌనం వహించారు మీరు. ద్రోహులు అక్రమార్జనా పరులని మీరు విచారణ చేసి కనుక్కొన్నారా? తుమ్మితే బందు దగ్గితే బందు అని అల్టిమేటం జారిచేస్తుంటే విసిగిపోయి కళాశాలలు,షాపులు తెరుచుకున్నారు.ఆ పాపానికి వాళ్ళ మీద దాడి చేశారు.
స్కూళ్ళు ,షాపుల మీద దాడి చేస్తే తెలంగాణ వాళ్ళకి పెద్దగా నష్టం జరుగదు పైగా అడిగేవాడుండడు.అదీ మీ ధైర్యం.3.తెలంగాణా కాగితాలు కనపడగానే వ్రుత్తి ధర్మం మరచి వివక్షతో దిద్దితే వ్రుత్తి ఆ గురవాన్ని కోల్పోతుంది. మా వాళ్లకు ఆ కపటం లేదు కాబట్టి లోకమంతటా పూజింప బడతారు.

జ.ప్రతిభకు ఎక్కడైనా గుర్తింపు ఉంది.అది లేనప్పుడు ఎక్కడైనా ఒక్కటే. సీమాంధ్రులు కావటమే ఆ ఉపాధ్యాయులు చేసుకున్న తప్పు.అందుకే వారిని చితకబాదారు.సంకుచిత మనస్త్వతాలతో గురువును కొట్టే సంస్కృతి సీమాంధ్ర విద్యార్థులకు లేదు కాబట్టే తెలంగాణా లెక్చరర్లు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు4.వారు ఇక్కడి మట్టి నమ్ముకొని, ఇక్కడ ఉండి, ఇక్కడి వారిని ఆదిపోసుకున్తుంటే ఎదిరించడం అనివార్యం అయ్యింది.


జ.అతివాదులా.ఆ మాటలు మీరనటం కంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు.కేసియార్, కోదండరాం కంటే అతివాదులు ఎవరున్నారు? ప్రతి వ్యక్తికీ భావప్రకటనా స్వేచ్చ ఉంది.మీకు తెలంగాణ కోరుకునే స్వేచ్ఛ ఉన్నట్లే, 'సమైక్య రాష్ట్రం కోరుకునే స్వేచ్ఛ సీమాంధ్రులకీ ఉంది.మీ అభిప్రాయలతో ఏకీభవించని వారినందరినీ కొట్టుకొంటూ వెళ్తారా?


5.తెలంగాణా ని అడ్డుకునే వారు అందరూ విరోదులే. వారు మీ కపట ప్రజా ప్రతినిదులవడం కాకతాళీయం

జ.మరి సమైక్యాంధ్రాకు మద్దతుగా మాట్లాడిన ఒవైసీని ఏమీ చెయ్యలేకపోయారే.ముసలివాళ్ళు,బలహీనుల మీదేనా మీ ప్రతాపం6. ధ్వంసం చేయించింది మీ వాడే. టీ జీ వెంకటేష్ కిరాయి గుండాలు చేసిన పని.

జ.ఇదొక నిరాధారమైన ఆరోపణ.తెలంగాణా తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసి సీమాంధ్రుల పై రుద్దే ప్రయత్నంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టి.ఆర్.ఎస్ కార్యకర్త లా మాట్లాడుతున్నారు మీరు

Reply
March 16, 2011 at 12:36 PM

నా ప్రతి స్పందన ఇది:
జ.సీమాంధ్రులు దొంగలని స్పష్టంగా అన్నాక దానికి స్పందిస్తే అది భుజాలు తడుముకున్నట్లా? ఎవరో కొంతమంది ద్రోహం చేశారే అనుకొందాం.మీరు జనరలైజ్ చేసి అందరినీ ఎందుకు తిడతారు?
-
పదాలని సూక్స్మంగా, టెక్నికల్ గా యథాతధంగా అనువదించుకోవడం విగ్నత ఉన్న వాళ్ళు చేసే పని కాదు. దాని కాంటెక్స్ట్ చూస్తారు. "ఆంధ్ర దొంగలు" అంటే ఆంధ్ర కి చెందిన దొంగలనే భావం కానీ, అందరూ దొంగలే అని అనుకోవడం సరి కాదు. జెనెరలయ్జ్ చేసేది మిమ్మల్ని ప్రేరేపించే నాయకులే కానీ, మేం కాదు. ఆ మాటకొస్తే నాకు తెలంగాణలో కన్న ఆంధ్ర ప్రాంతం నుండే మిత్ర బ్రుందం ఎక్కువ. ఎవరూ నొచ్చుకోరే? వారికి మేమనేది వాల్లని కాదు అని తెలుసు కాబట్టి. నొచ్చుకున్న వాల్లని చూస్తే భుజాలు తడుముకున్నట్టే కనిపిస్తుంది.
---------------------------
జ.ఎంతటి ఉదారత ? సీమాంధ్ర వ్యాపారాలు మూతపడితే వాటిని నమ్ముకున్న వేలాదిమంది తెలంగాణ ప్రజలు రోడ్డున పడి మీపైనే తిరగబడుతారని మౌనం వహించారు మీరు. ద్రోహులు అక్రమార్జనా పరులని మీరు విచారణ చేసి కనుక్కొన్నారా? తుమ్మితే బందు దగ్గితే బందు అని అల్టిమేటం జారిచేస్తుంటే విసిగిపోయి కళాశాలలు,షాపులు తెరుచుకున్నారు.ఆ పాపానికి వాళ్ళ మీద దాడి చేశారు.
స్కూళ్ళు ,షాపుల మీద దాడి చేస్తే తెలంగాణ వాళ్ళకి పెద్దగా నష్టం జరుగదు పైగా అడిగేవాడుండడు.అదీ మీ ధైర్యం.
-
సీమాంధ్ర వ్యాపారాల మీద వేలాది మంది తెలంగాణ ప్రజలు ఆధార పడి ఉన్నారనుకోవడం మూర్ఖత్వం. వద్దు పొమ్మన్నా కలిసుందాం అని పాకులాడె వాల్లు ఆలోచించుకోవాలి ఎవరు ఎవరి మీద ఆధార పడి ఉన్నారనేది.
విచారణ చేయవలిసిన అవసరం లేదు. మచ్చుకి కొన్ని. దొంగ ప్రభుత్వంతో కుమ్మక్కయి బినామీ భూములని వెయ్యి రూపాయలకి ఎకరం చొప్పున కొన్న అక్కినేని, 25000 లకి ఎకరం చొప్పున కొన్న రామోజీ రావు, 12000 కి ఎకరం చొప్పున కొన్న మురళీ మోహను, కోట్ల విలువ ఉన్న ప్రభుత్వాస్తులని, బినామీ భూములనీ, బంజారా భూములనీ అభివ్రుద్ధి పేరుతో వేలల్లో సొంతం చేసుకోవడం రాష్త్రమంతా తెలిసిన బహిరంగ రహస్యం. ఇంకా లగడపాటి లాంటి దొంగలు కూడా ఉండనే ఉన్నారు. జై తెలంగాణ అన్నందుకు పిల్లలని చితకబాదిన శ్రీ చైతన్య ఒక బ్రాంచ్ మీదనే దాడి జరిగింది. తరతరాల అన్యాయం ముందర, దోపిడీ ముందర ఇవి చిన్నగా కనిపిస్థాయి. నిగ్రహం కోల్పోయిన ప్రజలని యే నాయకుడూ ఆపలేడు.

Reply
March 16, 2011 at 12:40 PM

జ.ప్రతిభకు ఎక్కడైనా గుర్తింపు ఉంది.అది లేనప్పుడు ఎక్కడైనా ఒక్కటే. సీమాంధ్రులు కావటమే ఆ ఉపాధ్యాయులు చేసుకున్న తప్పు.అందుకే వారిని చితకబాదారు.సంకుచిత మనస్త్వతాలతో గురువును కొట్టే సంస్కృతి సీమాంధ్ర విద్యార్థులకు లేదు కాబట్టే తెలంగాణా లెక్చరర్లు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు
-
జ: సీమాంధ్రులు కావడమే వారు చేసిన తప్పా? ఎంతమంది ఆ తప్పు చేసి షిక్షలని అనుభవిస్తున్నారు మరి? ఇక్కడ లక్షల్లోనే ఉన్నారే ఆ తప్పు చేసిన వారు? వారందరినీ ఎందుకు తన్నుతలేరు? గురువు గురువునని మరిచిపోతే గురుత్వం గురుతు చేయాలిసి వచ్చింది. ఆ చూసాం, అకారణంగా తెలంగాణ వాడనే నెపంతో బట్టలూడదీసి పోస్టుమాన్ తో వీధుల్లో తిప్పించారు. బాగానే చూసాం మీ సంస్క్రుతి ని.

Reply
March 16, 2011 at 12:48 PM

అతివాదులా.ఆ మాటలు మీరనటం కంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు.కేసియార్, కోదండరాం కంటే అతివాదులు ఎవరున్నారు? ప్రతి వ్యక్తికీ భావప్రకటనా స్వేచ్చ ఉంది.మీకు తెలంగాణ కోరుకునే స్వేచ్ఛ ఉన్నట్లే, 'సమైక్య రాష్ట్రం కోరుకునే స్వేచ్ఛ సీమాంధ్రులకీ ఉంది.మీ అభిప్రాయలతో ఏకీభవించని వారినందరినీ కొట్టుకొంటూ వెళ్తారా?
జ:
ఇక్కడ కూడా అదే సమాధానం. ఎంత మంది మా తో యేకీభవించని వాల్లని కొట్టాం? ఇక్కడ సినిమాలు తీసుకోవడం లేదా? వ్యాపారాలు చేస్కోవడం లేదా? సమైక్యాంధ్ర అన్నందుకు చిరంజీవిని చెప్పు దెబ్బలు కొట్టలేదు. ఇక్కడికొచ్చి సెంటిమెంటుని వాడుకుందామని చూసి, నమ్మించి ద్రోహం చేయాలని చూసినందుకు చెప్పు దెబ్బలు, కోడి గుడ్లు కొట్టాల్సి వచ్చింది.. మిగతా సమైక్య వాదులంతా స్వేచ్చగా తిరగుతలేరా? తిరగడమేం ఖర్మ బాహటంగా బెదిరిస్తున్నారు కూడా, మా జాగలకే వచ్చి మరీ. స్వేచ్చ గురించి మీరు మాట్లాడ్డం హాస్యాస్పదం. ఎక్కడ యే ఆంధ్ర పాలకుని కన్ను పడితే ఎవని సంసారం నాషనమవుతుందోనని స్వేచ్చ కోల్పోయి గొంతెత్తి స్వేచ్చానాదాన్ని లేపేది మేము. మీరు కాదు.

Reply
March 16, 2011 at 12:52 PM

మరి సమైక్యాంధ్రాకు మద్దతుగా మాట్లాడిన ఒవైసీని ఏమీ చెయ్యలేకపోయారే.ముసలివాళ్ళు,బలహీనుల మీదేనా మీ ప్రతాపం?
-
ఉద్యమిస్తున్నాం. ఎవరి మీద ప్రతాపం చూపే ఉద్దేషం ఎవరికీ లేదు. మీ ప్రతాపాలకు, మా భూములు, నీళ్ళు, భాష, సంస్క్రితి, ఉద్యోగాలు, అస్తిత్వం, పరిపాలనా యంత్రాంగం అన్నీ కొట్టుకు పోయాయి. యేనుగొచ్చి ప్రతాపం చూపిస్తున్నావని యెలుకని అన్నట్టు ఉంది.

Reply
March 16, 2011 at 12:57 PM

ఇదొక నిరాధారమైన ఆరోపణ.తెలంగాణా తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసి సీమాంధ్రుల పై రుద్దే ప్రయత్నంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టి.ఆర్.ఎస్ కార్యకర్త లా మాట్లాడుతున్నారు మీరు.
-
సొంత గడ్డ మీద ఒక్క తెలంగాణ వాది కూడా టాంక్ బండ్ పైన అడుగు పెట్టక ముందే మూడు వేల మంది కిరాయి గాల్లతో అందరి కన్నా ముందు అక్కడికి చేరుకున్న టీ జీ వెంకటేష్ బ్రుందం, జై తెలంగాణ అని చెయ్యెత్తీ ఎత్తక ముందే చేతులు విరిచేసి, బుల్లెట్లు పేల్చే పోలీసులు చూస్తూ చేతులెత్తేసిన సమయం, అంతా తెలంగాణ ఉద్యమం మీద బురద చల్లడానికి ముందుగా చేసుకున్న పథకం. టీ వీ నైన్ లు చూస్తే ఆధారాలు కనిపించవు. పోరు భూమిని స్వాసిస్తే నిజాలు తెలుస్తాయి.

Reply

Anarchist గారు, మీ వాదనలన్నీ చదివాక నాకొక్కటే అర్థమయ్యింది.కేసియార్,రాజకీయ నిరుద్యోగులైన అతని కుటుంబ సభ్యులు, ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాం లాంటి కుహానా మేధావులు,సూడో జర్నలిస్టులు పనిగట్టుకొని వారి వారి ప్రయోజనాల కోసం మీలాంటి యువకులకి(?) బాగా బ్రెయిన్‌వాష్ చేశారు.ఆ మైకంలో పడ్డ మీరు వాళ్ళు వాడిన 'తరతరాల అన్యాయం','దోపీడి' వంటి పడికట్టు పదాలనే మళ్ళీ మళ్ళీ వల్లిస్తున్నారు కానీ, మీ వాదనను నిరూపించే ఒక్క సరైన కారణం చెప్పటం లేదు.

Reply

తెలంగాణలో చిన్న పిల్లోడిని అడిగినా చెబుతాడు హైదరబాద్‌లో ఉన్న అత్యథిక శాతం పరిశ్రమలు సీమాంధ్రులవే నని.సినిమా,రియల్ఎస్టేట్,ఫార్మా,ఐ.టి రంగాలలో అగ్రస్థానం మాదే.ఈ విషయం కూడా తెలియకుండా మీరు అజ్ఞానంతో వాదిస్తే జాలిపడటం తప్ప చెయ్యగలిగింది లేదు.ముందు వాస్తవాలు తెలుసుకోండి.

ఎవరు మిమ్మల్ని దోచుకుంది? హైదరాబాద్ ప్రాంతం మీ సొత్తా ? మీరెవరు మమ్మల్ని పొమ్మనటానికి? ఇప్పుడు మీరు తెలంగాణ అంటున్న ప్రాంతం,కోస్తాంధ్ర ప్రాంతాలు ఒకప్పుడు శాతవాహనులు,కాకతీయుల కాలంలో ఉమ్మడి ఏలుబడిలో ఉండేవని తెలుసా? 1766 వరకూ సీమాంధ్ర కూడా నైజాం ఆధీనంలోనే ఉండేదన్న విషయం మీకు తెలుసా ? 1766-1802 మధ్యకాలంలో నైజాం నవాబులు సీమాంధ్ర జిల్లాలు ఆంగ్లేయులకి ఒక్కొక్కటిగా అమ్ముకుంటే వచ్చిన డబ్బుతో అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణ.అలా మా సొమ్ము దోచుకుని మీరు భవనాలు,హర్మ్యాలు నిర్మించుకున్నారు.ఈ విషయాలు మీకెవరూ చెప్పలేదా?

Reply

శ్రీ చైతన్య మీద ఎందుకు దాడి చేశారో చెప్పారు. CMR షాపింగ్ కాంప్లెక్స్ బిగ్‌బజార్ అవుట్‌లెట్స్ లాంటి ఇతర షాపుల మీద ఎందుకు దాడి చేశారు? వక్ఫ్ భూములు అమ్ముకున్న షబ్బీర్అలిని వదిలేశారే పాపం? చిరంజీవి సంగతి పక్కన పెట్టండి.జూనియర్ ఎన్‌టీయార్,అల్లు అర్జున్,మహేష్‌బాబు,మంచు మనోజ్,దగ్గుబాటి రాణా,అల్లరి నరేష్ షూటింగ్‌సెట్స్ పై మీరెందుకు దాడి చేశారు ? వాళ్ళేమీ మీ ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్ళాడలేదే ? అల్లరి నరేష్ సినిమా షూటింగ్ పై ఎందుకు దాడి చేశారు? ఆయనకూ ఆయన కూటుంబానికీ ఎటువంటి,ఆస్తులు స్టూడియోలు కూడా లేవే ? మీ విద్యార్థులు ఎవరో ఒకరు ఇద్దరు ఉపాధ్యాయుల మీద మాత్రమే దాడి చెయ్యలేదు.వాల్యుయేషన్‌కు వొచ్చిన మొత్తం
సీమాంధ్రుల ఉపాధ్యాయులు వెళ్ళిపోవాలని అల్టిమేటం జారి చేశారు. మీకు తెలియకపోతే గూగుల్ చెయ్యండి.మీకు ఏనాడు నిగ్రహం ఉందని ఇప్పుడు కొత్తగా కోల్పోటానికి.ఆది నుంచీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసింది మీరే.తర్వాత పెడబొబ్బలు పెట్టేది మీరే.
తప్పు మీది కాదు.మిమ్మల్ని ఇలా తయారుచేసిన మీ నాయకులది.


మీ వాళ్ళు అడుగుపెట్టకముందే టీ.జీ.వెంకటేష్ మనుషులు వచ్చేశారా? LOL.మీలో ఇంతటి హాస్యాచతురత ఉందనుకోలేదు.పోతనామాత్యుని విగ్రహం దగ్గర ప్రతిజ్ఞ చేయించిన కేసీయార్ మీ కళ్ళకు కనిపించలేదా? కేటియార్,హరీష్‌రావు,విద్యాసాగర్‌రావు
వంటి నేతలు టాంక్‌బండ్‌పై విగ్రహాలు కూల్చేస్తామని ముందే హెచ్చరికలు జారీ చేసిన విషయం మీదాకా రాలేదా? అమానుషంగా మహిళా జర్నలిస్టుని కొట్టి ముప్పైకి
పైగా కెమెరాలు ధ్వంసం చేసిన మీరు టీ.వీ9 దృశ్యాల గురుంచి మాట్లాడితే పిల్లి కళ్ళుమూసుకొని పాలు తాగే సామెత గుర్తొస్తుంది.

Reply

2001 నాటికి తెలంగాణలో 5,60616 ఫ్యాక్టరీ ఉద్యోగులు ఉంటే,కోస్తాంధ్రలో 220351 మంది,రాయలసీమలో 59823 మంది మాత్రమే ఉన్నారు.2008 ఆగస్ట్‌నాటికి ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పరేషన్(ఆఫీడ్ఛ్) అర్థిక సహాయం చేసిన యూనిట్లు తెలంగాణలో 505 ఉంటే,కోస్తాంధ్రలో 199,రాయలసీమలో 92 మాత్రమే.చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు ఏ.పి ఫైనాన్షియల్ కార్పొరేషన్ అందించిన ఆర్థిక ప్రొత్సాహం తెలంగాణలో 373 కోట్లు,కోస్తాంధ్రలో 214 కోట్లు,రాయలసీమలో 74 కోట్లు. ఎంతకాలమని ప్రజల చెవుల్లో పువ్వులు పెడతారు ?

Reply
March 17, 2011 at 8:59 PM

Anarchist గారు, మీ వాదనలన్నీ చదివాక నాకొక్కటే అర్థమయ్యింది.కేసియార్,రాజకీయ నిరుద్యోగులైన అతని కుటుంబ సభ్యులు, ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాం లాంటి కుహానా మేధావులు,సూడో జర్నలిస్టులు పనిగట్టుకొని వారి వారి ప్రయోజనాల కోసం మీలాంటి యువకులకి(?) బాగా బ్రెయిన్‌వాష్ చేశారు.ఆ మైకంలో పడ్డ మీరు వాళ్ళు వాడిన 'తరతరాల అన్యాయం','దోపీడి' వంటి పడికట్టు పదాలనే మళ్ళీ మళ్ళీ వల్లిస్తున్నారు కానీ, మీ వాదనను నిరూపించే ఒక్క సరైన కారణం చెప్పటం లేదు.
-
.కేసియార్, జయశంకర్, కోదండరాం వీరేవ్వరి ఒక్క ఉపన్యాసం కూడా నేను వినలేదు. కనీసం వీళ్ళని దగ్గర్నుంచి చూసింది కూడా లేదు. నేను ఉద్యమం ఉదృతం కాకముందే అమెరికా వచ్చాను. కానీ మా కుటుంబం తరతరాలుగా పోరాటమ్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ పదాలు ఎవరో చెప్తేనో మీ లాగా టీ వీ నయిన్లు చూసో నేర్చుకోలేదు. అనుభవాల మీద, చరిత్ర సాక్షాలని చూస్తూ పెరిగిన జీవితం నేర్పిస్తుంది. ఇంకా మీ సమాదానాలంటారా? అదే నేనూ అడుగుదామని అనుకుంటున్నా. ఎంత సేపు పాడిందే పాటారా, పాసుపల్ల దాసరా అన్నట్టు చెప్పిందే చెపుతారు గాని మేమదిగిందానికి సమాధానం మీ దగ్గర ఉండదు, బదులుగా మరిన్ని ప్రశ్నలు మాత్రం వస్తాయి. లేదంటే ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. ఇది ఏ రకమయిన చర్చా స్వరూపమో నాకు అర్ధం కాకుండా ఉంది. పైగా అదే ప్రశ్న మమ్మల్ని వేస్తారు బుద్ది మంతులా లాగా.. అయినా ఎందుకు లెండి. మీకు మేము ఎం చెప్పినా ఎక్కదు. ఇద్దరి సమయం వృధా. ఎంత మంది చచ్చినా మీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. దీన్నే విష్ ఫుల్ థింకింగ్ అంటారు. మనమనుకున్నదే వేదం. అవతల వాడి ప్రాణం పోతున్న కూడా మనం కళ్ళు మూసుకుని అంటా మనమనుకున్నట్టు జరుగుతుంది అనుకుని వేదాలు వల్లిస్తుంటాం.

Reply
March 17, 2011 at 9:05 PM

తెలంగాణలో చిన్న పిల్లోడిని అడిగినా చెబుతాడు హైదరబాద్‌లో ఉన్న అత్యథిక శాతం పరిశ్రమలు సీమాంధ్రులవే నని.సినిమా,రియల్ఎస్టేట్,ఫార్మా,ఐ.టి రంగాలలో అగ్రస్థానం మాదే.ఈ విషయం కూడా తెలియకుండా మీరు అజ్ఞానంతో వాదిస్తే జాలిపడటం తప్ప చెయ్యగలిగింది లేదు.ముందు వాస్తవాలు తెలుసుకోండి.
-
అవును. ఎవరు కాదన్నారు? నేను ఆ పరిశ్రమల మీద తెలంగాణా ప్రజానీకం ఆధారిపడి ఉందని మీరనుకోవడం మీ మూర్ఖత్వం అన్నాను గానీ, మీ పరిశ్రమలు లేవని అనలేదే? చరితలు తిరగరాసిన ఘనత మీదని మరిచిపోయాను, నా మాటలకేం అడ్డు. మీరనుకున్నట్టు మీ జవాబులకి సరిపడా మా ప్రశ్నలని మార్చేస్తారు. బుద్ది చూపించారు. ఈ సారి కొంచెం జాగ్రత్తగా దోషం లేకుండా అడుగుతాను లెండి. కొసమెరుపు: సమైక్యమ్గా ఉందాం రా అని ప్రేమ చూపే వాడు "మావే" అని అహంభావం చూపడు.

Reply
March 17, 2011 at 9:11 PM

ఎవరు మిమ్మల్ని దోచుకుంది? హైదరాబాద్ ప్రాంతం మీ సొత్తా ? మీరెవరు మమ్మల్ని పొమ్మనటానికి?
--
దోచుకున్నారని మిమ్మల్ని ఎవరూ అనలేదు మహా ప్రభో అని వందల సార్లు చెప్పాం. మీరు అది చదవరు, వినరు. మాటి మాటికీ మమ్మల్నే అంటున్నారని భుజాలు మాత్రం తడుముకుంటారు.

మిమ్మల్ని ఎవరూ పొమ్మని అనలేదు మహాప్రభో అని కూడా వందల సార్లు చెప్పాం. అది కూడా మీకు అర్ధం కాదు.
మాటి మాటి కి గొప్ప ఆర్గుమెంట్ తీసినట్టుగా పొమ్మని అనడంలో నైతికత వెతుకే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రశ్నే లేదని అర్ధం కాదేన్డుకనో.
అప్రజాస్వామికంగా దోచిన భూముల దొంగలూ, దొంగ పెట్టుబడి దారులు లేపిన అపోహలని నిజమని నమ్మి అభద్రతా భావానికి లోనయితే అది మీ మానసిక దారిద్ర్యం తప్ప మరొకటి కాదు.

Reply
March 17, 2011 at 9:24 PM

ఇప్పుడు మీరు తెలంగాణ అంటున్న ప్రాంతం,కోస్తాంధ్ర ప్రాంతాలు ఒకప్పుడు శాతవాహనులు,కాకతీయుల కాలంలో ఉమ్మడి ఏలుబడిలో ఉండేవని తెలుసా? 1766 వరకూ సీమాంధ్ర కూడా నైజాం ఆధీనంలోనే ఉండేదన్న విషయం మీకు తెలుసా ? 1766-1802 మధ్యకాలంలో నైజాం నవాబులు సీమాంధ్ర జిల్లాలు ఆంగ్లేయులకి ఒక్కొక్కటిగా అమ్ముకుంటే వచ్చిన డబ్బుతో అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణ.అలా మా సొమ్ము దోచుకుని మీరు భవనాలు,హర్మ్యాలు నిర్మించుకున్నారు.ఈ విషయాలు మీకెవరూ చెప్పలేదా?
----
మహా ప్రభో, ఇది చదివాక నవ్వాలో ఏడవాలో కూడా అర్ధం కాలేదు. అడిగారు కాబట్టి చెప్పడం నా బాధ్యత. పుట్టు పూర్వోత్తరాలకి పొతే, నగరాల్ని ఎవరూ ఎవరికీ అమ్మరు. వాటి మీద శిస్తు తీసుకునే పద్దతి మాత్రం ఉండేది. శాతవాహనులు బాసర, కరీంనగరు, ఆదిలాబాదు, ఇంకా మరాట్వాడ సంష్టానం పరిధిల్లో శిస్తు వసూలు చేస్తే, కాకతీయులు కొంత రాష్ట్ర పై భాగం వరకూ వసూలు చేసారు. శిస్తు వసూళ్లతో నగర అభివృద్ధి జరిగింది అని ఆరోపించడం మూర్ఖత్వం. వాటితో ప్రబుత్వ వ్యయం, పరిపాలనా వ్యయం నిర్ణయించ బడేది.
సరే, ఈ సాంఘీక శాస్త్రం పక్కన పెడితే, మీరు చెప్పిన హాస్యాత్మక పద్దతిలో జరిగిందే అనుకుందాం. వందల ఏళ్ళ నాటి కనుమరుగయిన చరిత్ర ఆధారంగా ఇప్పటి పరిస్తితుల నిర్ణయాలు తీసుకోలేం. ఎందుకు తీసుకోలేం అంటే ఆ మార్పుల పరిణామాలు (ఉన్నట్టయితే) అవి చరిత్రని వెంటాడుతూ ఉంటాయి. వాటికి న్యాయం జరిగే దాకా. మేమెందుకు తెలంగాణలో ఆంద్ర ని కలిపినప్పటి యాభై ఏళ్ళ పీడన ని చెప్తామంటే, అది నాంది. అక్కడి నుండి, అప్పటి నుండి, ఇప్పటి వరకూ చరిత్ర యథాతథంగా పోరాట స్వరూపాలని మార్చుకొని వ్యతిరేకత పెల్లు బికుతూనే ఉన్నది. దాని తరవాత జరిగిన అన్యాయాలని, అక్రమాల్ని, దుర్మార్గాలని ఏకరువు పెడితే చరిత్ర మొట్ట దోపిడీ అవక్షేపాలే. వాటికి పరిహారం కాదు మేమదిగేది. ఇక ముందయినా ఈ దోపిడీ పరిపాలన ఆగుతుందని.

Reply
March 17, 2011 at 9:33 PM

ఆది నుంచీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసింది మీరే.తర్వాత పెడబొబ్బలు పెట్టేది మీరే.
తప్పు మీది కాదు.మిమ్మల్ని ఇలా తయారుచేసిన మీ నాయకులది.
--
తప్పదు మరి. ఈ దోపిడీ దొంగల నుండి మాకు విముక్తి రావాలంటే మా ప్రజలని చైతన్య పరచోద్దూ?
నాయకులా? వాళ్ళకే భద్రతా లేదు మా తెలంగాణలో. వాళ్ళు మాకేం చెప్తారు. అయినా ఇప్పుడు నాయకులు చెప్తే వినే పరిస్తితిలో ఉండనే అనుకుంటున్నారా తెలంగాణా ప్రజానీకం. ప్రజల్లో చైతన్యం మీకు ఇంకా నాయకుల మనోభావం గా కనిపించడం దురదృష్టకరం. మీ కళ్ళలో ఏముందో నాకు తెలుసు గాని మనసు పెట్టి చూడండి కనిపిస్తుంది.

Reply
March 17, 2011 at 9:42 PM

ఇంకా టాంక్ బండ్ సంగతి. కే సి ఆర్ వచ్చేసరికి కిక్కిరిసి పోయి ఉన్న ప్రజాశక్తి మీకు కనిపించలేద? వారు, తదితరులు అందరూ వస్తారు. రాకుంటే ఏమి జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు, వాళ్లకి అర్ధం అయింది కాబట్టి వాళ్ళు వస్తారు. పరిపాలన మాత్రమె నాయకుల చేతుల్లో ఉంటుంది. ఉద్యమం అంతా ప్రజల చేతుల్లో. రాకుంటే వాళ్ళకు పుట్ట గతులు లేకుండా పోతాయి కాబట్టి వస్తారు. దానర్ధం వాళ్ళే చేయించారని కాదు.

జర్నలిస్తులని కొట్టింది పోలీసులే. మీకు తెలియదు. మీరు చూపించిందే నమ్ముతారు. మా బాబాయి జర్నలిస్టు. మామూలు జర్నలిస్టు కాదండోయ్. ఓ పత్రిక సంపాదకుడు. వీ అయ్ పీ అనుకోండి. ముప్పి అయిదేళ్ళ పత్రికా అనుభవం ఉన్న సీనియరు, ఇంకా తెలంగాణా జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు, అందరూ అక్కడే ఉన్నారు. కళ్ళారా చూసిన వాళ్ళే. ఒక సారి సరదాకి ఫెసుబుక్ వెళ్లి చూడండి, అదే రోజు జర్నలిస్టులపై పోలీసులు చేసిన పనులన్నీ సాక్షాలతో సహా కనిపిస్తాయి. మీరు కళ్ళు మూసుకుని నేను చూసిందే వేదం అని అర్ధం లేకుండా వాదిస్తే అందులో విజ్ఞత ఎంత ఉందని మీరే ఆలోచించుకోండి.

Reply
March 17, 2011 at 9:49 PM

2001 నాటికి తెలంగాణలో 5,60616 ఫ్యాక్టరీ ఉద్యోగులు ఉంటే,కోస్తాంధ్రలో 220351 మంది,రాయలసీమలో 59823 మంది మాత్రమే ఉన్నారు.2008 ఆగస్ట్‌నాటికి ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పరేషన్(ఆఫీడ్ఛ్) అర్థిక సహాయం చేసిన యూనిట్లు తెలంగాణలో 505 ఉంటే,కోస్తాంధ్రలో 199,రాయలసీమలో 92 మాత్రమే.చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు ఏ.పి ఫైనాన్షియల్ కార్పొరేషన్ అందించిన ఆర్థిక ప్రొత్సాహం తెలంగాణలో 373 కోట్లు,కోస్తాంధ్రలో 214 కోట్లు,రాయలసీమలో 74 కోట్లు. ఎంతకాలమని ప్రజల చెవుల్లో పువ్వులు పెడతారు ?
-----------
సరే లెండి ఎవరు చూడోచారు గానీ. మీరు చేపినవాన్నే నిజాలే కావచ్చు. కాకుంటే ఈ లెక్కలతో ఏమి నిరూపిద్దామని అనుకుంటున్నారు. (ఏమి నిరూపించానని మీ అభిప్రాయం) ఓ ఆరంకెల సంఖ్యా లో ఉద్యోగులు ఉన్నారు, మూడంకెల సంఖ్యా కూడా దాటదు అందులోని ఆంద్ర వాళ్ళని తీసేస్తే మా సంఖ్యా. పరిశ్రమలు, అన్నీ ఉన్నాయి కాదనను.. ఇక్కడ కూడా. అందులో మీవి తీసేస్తే మావెం ఉండవు. పైసా ఖర్చు లేకుండా ఇక్కడ ప్రభుత్వం సొమ్ముతో పరిశ్రమలు స్థాపించి మళ్ళీ ఆ శేర్లని ప్రభుత్వానికే పది రెట్లు ఎక్కువ ధరలకి అమ్మిన సంస్థలు కోకొల్లలు. అవన్నీ చెప్పుకుంటే రామాయణం, వింటే భారతం అన్నట్టు ఉంటాయి గానీ దోపిడీ లీలలు.

Reply
March 17, 2011 at 9:52 PM

చివరగా చిన్న విషయం. ప్రపంచంలో ఎవరూ ఎక్కడికీ అభివృద్ధి చేద్దామని పోరు. అభివృద్ధి చెందిన చోట సంపాదించుకుందామని వెళతారు. నేనొచ్చి సంపాదించుకున్నా కాబట్టి ఇది నాదే అంటే "మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ"

Reply
March 17, 2011 at 9:55 PM

ఇంకో విషయం. అలా మీరు పుట్టు పూర్వోత్తరాలకి పొతే, భారతీయులమంతా కేరళ నుండి ఉద్భవించిన వాళ్ళం. ప్రాచీన భారతదేశాన్ని కేరళ గ మార్చమని అడిగినట్టుంది మీ చెప్పటం. బయట ఎక్కడన్నా అనేరు, నొరుతో కూడా నవ్వరు.

Reply
March 17, 2011 at 10:43 PM

1.పార్టీ పెట్టింది మొదలు అంధ్రులు దొంగలు దోపిడీదారులని ఆడిపోసుకున్నది కేసీయార్ కాదా ?
-->పెదన్న కేసిఆర్ దొంగలు దోపిదోల్లు అన్నాడు..కాని గా లగడపాటి,కర్నూల్ ఎమ్మెల్లే మమ్మల్ని ఉగ్రవాదులన్నాడు బాసు..వైఎసార్ కు విసా కావాల్నంటా తెలంగాణ రావాలంటే...ఇందులో అర్థం ఏముంది బాసు...మమ్మల్ని ఉసి కొల్పడం తప్ప ..

2.ఆంధ్రావాళ్ళను తరిమికొడతాం అని చిందులు తొక్కింది కేసీయార్‌కాదా ?
-->
ఆంధ్రోల్లని తరిమి కొడుతం అని ఎప్పుదన్నదో ఒక ప్రూఫ్ చూపెట్టు..ఆంధ్రా దోపిడి దారులని తరిమికోడుతాం అని అంటదు భై.
3.సీమాంధ్ర కళాశాలలు,వాణిజ్య సముదాయాల పై దాడులకు తెగబడింది మీరు కాదా?
-->దాడి అంటే, విజయవాడ ల ఫ్యాక్షనిష్టులు చేసేది.
జస్ట్ కోపంతో వెంబడించింది దాడైతే..ఇప్పుడున్న ఆంద్ర లెక్చరర్ లను దాడి చేయటానికి నిమిషాలు చాలు..కొని మేము చేసేది దాడి కాదు..మా ఆక్రోష విన్నపం.

4.వాల్యూయేషన్‌కి వచ్చిన సీమాంధ్ర ఉపాధ్యాయులపై భౌతిక దాడులకి తెగబడింది మీ విద్యార్థులు కాదా? ఈ సంఘటన జరిగిన తర్వాత సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ ఉపాధ్యాయులుకు శాలువాలతో సన్మానం చేసింది వాస్తవం కాదా ?
--> 3వ జవాబు. సన్మానాలు మేము బోచేడు చేసినం...మా సారూ ఆంధ్రా సరే, మూడు రోజుల కిందటనే చేసినం సన్మానం.

4.సీమాంధ్ర కళాకారుల మూవీ షూటింగ్స్ సెట్స్ ధ్వంసం చేసింది మీరు కాదా?
సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడికి దిగింది మీరు కాదా ?
--> విజయవాడ లో కండక్టర్ పై దాడి మేము చేసినమా! అరె భై ఆకలి కోపం తో చేసిన దాడి కి, శత్రుత్వం తో చేసిన దాడి కి తేడా తెల్వదా భై!
దాడు లు చంపటానికి, లేదంటే ఇరగ్గోత్తదానికి చేసినవి కావు...ఐన మా దాడి లో ఎ నాయకుడు గాయపడ్డాడు ఒక్కని పేరు చెప్పు....ఎవెన్ జె.పి కి కూడా కనిసం దాదులు కూడా రాలే.

5.సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేసింది మీరు కాదా ?
సీమాంధ్ర నేతలు కేవలం తెలంగాణ రాదంటే రెచ్చగొడుతున్నారు అంటారు మరి మీరు చేసిన నిర్వాకాలని ఏమని అనాలి ?

--> గత పది సంవత్సరాలనుంచి శాసన సభలో కొమురం భీం విగ్రహం టాంక్బండ్ పై పెట్టాలని తిర్మనిన్స్తే ,ఇప్పటికి పెట్టలే..దీని గురించి ఎవడు అడగడు..మా తెలంగాణ లో ఒక్కడు లేదా భై మీ అంత గొప్పోళ్ళు..

మా విద్యార్థుల్ని చంపినా ముఖ్యమంత్రి బొమ్మ టాంక్ బ్యాండ్ పై ఉంటె ౩౦ ఏండ్ల సుంది చూస్తున్నాం భై..

ఏంది భాయ్ నీకు తోచినట్లు రాసినావ్...ఉద్యమం అంటే చిన్న చిన్నవి ఉంటై...చూడు గా స్వాతంత్రోద్యమం లనే ఎంతో వయోలెన్స్ జరిగింది...
అంతెందుకు మొన్న తహ్రిర్ స్క్వైర్ తెలిసిందే గదా!

Reply

Anarchist గారు,

నేనడిగిన దానికి దేనికి సరిగ్గా సమాధానం ఇచ్చారు మీరు ? పొంతన లేని జావాబులిస్తే మరిన్ని ప్రశ్నలు తప్పవు. వ్యక్తిగత విమర్శలు ఎవరు చేశారో మీ కామెంట్లు నా కామెంట్లు చదువుకోండి. ' నోటితో నవ్వరు, మానసిక దారిద్ర్యం ' లాంటి మాటలు వాడి మళ్ళీ వ్యక్తిగత విమర్శలు అనటం చూస్తే మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కినట్లుంది మీ వరుస.స్వార్థపూరిత రాజకీయాల కోసం అమాయకులైన విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది.ఒక్క క్షణం నాయకులు చెబుతున్న దానిలో నిజాలెన్ని అని వాళ్ళు ఆలోచించుకుంటే ఈ పరిస్థితులు రావు.

Reply

సీమాంధ్ర పరిశ్రమలు మూతబడితే వాటిని నమ్ముకున్న వేలాది తెలంగాణ ప్రజలు నష్టపోతారన్నాను కానీ, సీమాంధ్ర పరిశ్రమల మీదే తెలంగాణ ప్రజలు ఆధారపడ్డారని అనలేదు.తేడా గమనించగలరు. ముందు వాక్యాలు సరిగ్గా అర్థం చేసుకోండి.మేము 'మావి' అంటే అది అహంభావం, మీరు ' వద్దు పొమ్మంటున్నా కలిసుందామని పాకులాడుతున్నారు, ఆంధ్రా బాగో ' అంటే అది ' మర్యాద ' .మీరు చేసేవి భౌతిక దాడులు కావు సత్కారాలు. ఆహా ! సూక్తిముక్తావళి మీ దగ్గరే నేర్చుకోవాలి

వద్దుపొమ్మన్నా కలిసుందామని పాకులాడేవాళ్ళమని మీరే అన్నారు.అలాగే దోపిడి గురుంచి,అన్యాయం గురుంచి మీరు వల్లించిన వాక్యాలు కామెంట్స్‌లోనే ఉన్నాయి చదువుకోండి.అపోహలు నమ్మి చెన్నారెడ్డి చేతిలో ఒకసారి మోసపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు.తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆత్మవంచన చేసుకుంటూ మానసిక దారిద్యంలో మునిగితేలుతున్నది మీరు.

Reply

LOL.మళ్ళీ కామెడీ.శిస్తులు,పన్నుల వసూళ్ళతో కాకుండా ఇంకేలా అభివృద్ధి చేస్తారు మహాప్రభో ? డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా లేక పైనుండి ఊడిపడుతున్నాయా ? ప్రజల నుంచో,ఇతరుల నుంచి వసూలు చేస్తేనే కదా పైకం అందేది ? 1766 లో ఉత్తర సర్కారు జిల్లాలను బ్రిటీషు వారికి ధారధత్తం చేసినందుకు నిజాంకు సాలీనా ముట్టిన ప్రతిఫలం 90,000 పౌండ్లు.1768లో లొంగిపోయి స్నేహ హస్తం చాచినందుకు ఏటా ముట్టిన సొమ్ము 50,000 పౌండ్లు.గుంటూరు జిల్లాను ఇచ్చినందుకు 1788 నుంచి ప్రతి సంవత్సరం ముట్టిన సొమ్ము
7లక్షల పౌండ్లు.1800లోకడప,కర్నూలు,బళ్ళారి,
అనంతపురం జిల్లాలు వదులుకున్నందుకు నిజాం సైనిక బలగాల నిర్వహణ ఖర్చులు భరించారు ఆంగ్లేయులు. ఈ సొమ్ములో లేశమాత్రం కూడా మీ ప్రాంతాభివృద్ధికి ఖర్చు చేయలేదంటారా? ఎవరిది మూర్ఖత్వం? మీదా ? నాదా ? వందల ఏళ్ళ నాటి చరిత్ర ఆధారంగా ఇప్పుడెలా నిర్ణయం తీసుకుంటారని అడిగారు.మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకముందే, ఎప్పుడో సర్ అర్థర్‌కాటన్ కట్టించిన ఆనకట్ట వల్ల సుసంపన్నమైన కోస్తాంధ్రను చూపించి తెలంగాణకు అన్యాయం జరిగిందని మీరు గగ్గోలు పెట్టటం లేదా? అప్పుడు మీకు భౌగోళిక చారిత్రక కారణాలు కనిపించలేదా ?

Reply

ప్రజల్లో చైతన్యం గురుంచి నేను మాట్లాడను గానీ,మీ నాయకులకే భధ్రత లేదన్నది మాత్రం హాస్యానికి పరాకాష్ట.భధ్రత లేకేనా లగడపాటి రాజగోపాల్ మీద ఢిల్లీ నడివీధుల్లో దాడి చేశారు? అందుకేనా కావూరి ఇంటిపై దాడి చేశారు?

మీ బాబాయి ఎవరో నాకు తెలియదు .ఉద్రేకపరిచే ప్రసంగాలతో దాడులు చేసే తెరాస శ్రేణులు శాంతికాముకులని,చుట్టుముట్టిన తెలంగాణ వాదుల మధ్య నుంచి పోలిసుల రక్షణలో బయటపడ్డ
టీ.జీ.వెంకటేషే ఇదంతా చేయించాడనీ చెబుతూంటే నవ్వాలో ఎడవాలో తెలియటం లేదు. ట్యాంక్‌బండ్ విధ్వంసం గురుంచి మాట్లాడుతూ తెలంగాణ శ్రేణులు కొన్ని ' విగ్రహాలు పెడితే మళ్ళీ కూల్చేస్తాం ' అని
హెచ్చరించాయి.' మళ్ళీ కూల్చేస్తాం ' అంటే ఇంతకుముందు కూల్చింది తామే అని ఒప్పుకున్నట్టే గా.

Reply

భారతీయులంతా కేరళ నుండి ఉద్భవించారా? LOL. ఎవరు మీకు చెప్పింది ? అసలు కేరళ ఎలా ఉద్భవించిందో మీకు తెలుసా? నన్ను గాదు మిమ్మల్ని చూసి నవ్వుతారు బయటెక్కడైనా ఆ మాట అంటే.అసలు భారతీయులు ఏ
హ్యూమన్‌రేస్ కి సంబంధించిన వారన్నదాని మీద బోల్డంత గందరగోళం ఉంది.ఎవరికీ ఏకాభిప్రాయం లేదు.ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్ యిండియా కూడా నిర్ధారించని విషయాన్ని మీరు ధృవీకరించేశారా? తెలంగాణ చరిత్ర వక్రీకరించింది కాక ఇప్పుడు భారతదేశం మీద పడ్డారా తమరు?

అన్యాయం,దోపిడీ అన్నారుగా,అందుకనే కొన్ని ఉదాహరణలిచ్చాను.ఇలాంటి స్టాటిస్‌టిక్స్ బోలెడు.వీటిద్వారా నేను చెప్పదల్చుకున్నది నిజంగా మీరు ప్రచారం చేస్తున్నంత వెనుకబడ్డ ప్రాంతం కాదు తెలంగాణ అని.తెలంగాణలో లబ్దిపొందిన వాళ్ళలో ఎంతమంది సీమాంధ్రులున్నారో నాకు తెలియదు.ప్రభుత్వం కూడా సహాయం చేసే సమయంలో అటువంటి ప్రశ్నలు వేస్తుందని అనుకోను.కొన్ని విషయాల్లో అసమానతలు ఉండొచ్చు కానీ అవేవీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించేంతగా లేవు.ఇక మీరు చెప్పిన పరిశ్రమల లాంటివి ఒక్క మీ తెలంగాణకే పరిమితం కాలేదు.సీమాంధ్రలలో కూడా అలానే ఉంది.ప్రతిదాన్నీ భూతద్దంలో చూపించి ఎందుకు విధ్వంసం వైపు అడుగులు వేయిస్తారు?

రాష్ట్ర రాజధాని కాబట్టి సహజంగా బ్రతుకుతెరువు కోసం సీమాంధ్రలు చాలామంది వలస వచ్చి తమ తమ అదృష్టాలని పరీక్షించుకున్నారు.వాళ్ళెవరూ ' ఇది మాది మీరు వెళ్ళిపోండి ' అనటం లేదు. ' మాది కూడా ' అంటున్నారు.తేడా గమనించగలరు.మనిషికో మాట అన్నారు కాబట్టి మీకు ఇదే నా చివరి సమాధానం.

Reply

నరేష్ అన్నా,

మీరడిగిన వాటికి సమాధానాలు నా కామెంట్స్‌లో ఉన్నాయి.దయచేసి చదువుకోండి

Reply
Post a Comment