సరసిని



ల్లున అందెలు కదల్చనీక
మెల్లన దరిచేరి మాటునదాగి
కళ్ళను నీ మృదుకరముల గప్పి
అల్లరి చేతల నలరింతు వీవు 

చక్కని చుక్కగ చెంతకు చేరి
చక్కిలిగింతల చిక్కులు రేపి
చెక్కిలి నొక్కగ చేయి చాపితే
చిక్కక చల్లగా జారుకొనేవు

పట్టుకోవాలని పైకిలేవగానే
పిట్టవోలే బెదరి పారిపొయేవు
పట్టుకోలేనని పకపకా నవ్వి
బెట్టుతో నిలువెల్ల పొంగిపొయేవు

అల్లంత దూరన అప్సరవోలె
కళ్ళింతచేసి కవ్వింతువీవు
ఎలకోయిల వలె ఎలుగెత్తి పిలిచి
కలహంస నడకల కదలిపోయేవు

తొణికిసలాడేటి తొలిప్రాయమందు
తనరారు నీ మేను తూగాడిపోవ
కనరానియందాల కనువిందు జేసి
మనసులో చెరగని ముద్రవేసేవు

దుడుకు కోర్కెల నాలో తలపింపజేసి
ఉడికించి ఊరించి ఉరకలేయించి
కడగంటి చూపుల్లో కొసరేటి-వలపు
వేడిమిలో నేను వేగిపోవంగ

సుడిగాలిలా వచ్చి చుట్టేసి -ప్రేమ
జడివానలో నన్ను ముంచెత్తివేసేవు

(పాతికేళ్ళ క్రితం  మా నాన్నగారు వ్రాసిన కవిత )


4 comments

July 14, 2013 at 12:21 PM

mee blog chala chala bavundandi. paintings chala bavunnayi.

Reply

ప్రసూన గారు థాంక్యూ

Reply
January 31, 2014 at 10:24 AM

శ్రీకాంత్ గారు... మీ నాన్నగారు రాసింది అద్భుతంగా ఉంది.
చాలా థ్యాంక్సండి, ఆనాటి యువత కేరింతలను కళ్ల ముందు ఉంచినందుకు.

Reply

సతీష్ గారు,

ధన్యవాదాలు

Reply
Post a Comment