తిలా పాపం తలా పిడికెడు


మా తెలుగుతల్లి మూగబోయింది.

జాతి కోసం జ్యోతిలా వెలిగిపోయిన పొట్టి శ్రీరాములుగారు.. మీ త్యాగస్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చేశారు.

ఒక తాగుబోతుని, వదరుబోతుని, మనుషుల రవాణా కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మీ సరసన సింహాసనం వేసి మరీ రాజ్యాభిషక్తున్ని చేస్తున్నారు.

ఈ పాపం ఎవరిది ?

శుష్కవాదనలతో రంగుల లోకం సృష్టించి విద్యార్థులను రెచ్చగొట్టి వారి బలిదానాలకు, రాజకీయ అస్థిరతకు కారకులైన రాజకీయ రాబందులదా, నిరుద్యోగులదా ?

ఏ వాదమూ వినిపించని 2000లోనే కేవలం చంద్రబాబుని, బి.జె.పి.ని రాజకీయంగా ఎదుర్కోవటానికి ప్రత్యేక తెలంగాణ తీర్మానంపై సంతకం పెట్టి తెలుగు జాతి సమైక్యతకు తూట్లు పొడిచిన  వై.యస్.ఆర్ దా ?

స్వార్థప్రయోజనల కోసం రెండు ప్రాంతాల ప్రజల మధ్య సాంస్కృతిక, మానసిక వైషమ్యాలను ఎగదోసి సంబరాలు జరుపుకుంటున్న కే.సి.యార్ దా? 

వ్యాపార ప్రయోజనాల కోసం సమైక్యవాణిని నొక్కిపట్టి పనికిమాలిన విషయాలపై పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వ్రాసి, విశ్లేషణలు జరిపి కాలం వెల్లబుచ్చిన పత్రికా యాజమాన్యాలదా ?

ముఖ్యమంత్రి పీఠంపై మరులు పెంచుకొని సిద్ధాంతాల్లేని పార్టీని స్థాపించి, అనవసర రాజకీయ సమీకరణలకు కారకుడై, ప్రజాభిమానం నవ్వులపాలేయ్యేలా పార్టీని విలీనం చేసిన చిరంజీవిదా ?

తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పడిన పార్టీని అధికారవ్యామోహంతో తెలంగాణా వాదానికి తాకట్టు పెట్టి, తెలుగుదేశానికి తలకట్టు లేకుండా 
చేసిన విఫల ప్రతిపక్ష నేత చంద్రబాబుదా ?

రాజకీయ మనుగడ కోసం రాష్ట్రాలను ముక్కలుగా చీల్చి జైఆంధ్ర లాంటి నిర్జీవ ఉద్యమాలను లేవదీస్తున్న బి.జె.పి దా ?

అసెంబ్లీ సాక్షిగా దాడులు చేసి మరీ తెలంగాణవాదం తలకెక్కిస్తూంటే అదేమిటనే ధైర్యం చెయ్యలేక  దద్దమ్మల్లా కూర్చున్న సీమాంధ్ర నాయకులదా ? సమైక్యవాదులదా ?

బానిసత్వపు బొమికలతో తయారై అధినేత్రి కృపాకటాక్షం కోసం అనుక్షణం అంగలారుస్తూ వంగి వంగి దణ్ణాలు పెట్టి పారిశ్రామిక అవసరాల కోసం పూటకో మాటమాట్లాడే సీమాంధ్ర కాంగ్రెస్  శాసనసభ్యులదా, ఎం.పి.లదా ?

ఒక కీలకమైన ప్రకటన చేస్తున్నప్పుడు సమగ్ర అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితులను  తెలుసుకోవాలన్న కనీసం ఇంగిత జ్ఞానం లేని గృహమంత్రి చిదంబరానిదా ?

అఖిలపక్షంలో నిర్భయంగా నిజం చెప్పలేక నీళ్ళు నమిలి గోడమీద పిల్లి వాటం ప్రదర్శించిన  సీమాంధ్ర  శాసనసభ్యులదా?

ఆరంభ శూరత్వం అలసత్వమే తప్ప అంతిమ కార్యాచరణ లేని సమైక్య ఐకాసలదా ? 

 యాభైయేళ్ళ పాటూ వెన్నుదన్నుగా నిలిచిన ఒక రాష్ట్రాన్ని, ఎం.పి.సీట్ల కోసం, ఆ రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో నిమిత్తం లేకుండా, ఆ ప్రాంతపు సమస్యలపై ప్రాథమిక అవగాహన కూడా లేని ఇతర రాష్ట్రాల నాయకుల అంగీకారంతో ముక్కలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సోనియా గాంధీ దా? తను ప్రధానమంత్రో డూ డూ బసవన్నో తేల్చుకోలేని మన్మోహన్‌సింగ్‌దా?

ఇన్ని జరుగుతున్నా ఎప్పట్లాగే సిద్ధాంతాలతో పనిలేకుండా కులం కోసం, మతం కోసం, సినిమా గ్లామర్ కోసం  కుత్తుకలు తెగ నరుక్కొని, నోట్ల మత్తులో వోట్లు తనఖా పెట్టి అసమర్థ ప్రజా ప్రతినిధులను అందలాలెక్కించి ఆ తర్వాత ఈసురోమంటున్న సీమాంధ్ర ప్రజలదా ? వాళ్ళ అజ్ఞానానిదా ?

ఈ పాపం అందరిదీ.

తిలా పాపం తలా పిడికెడు.


7 comments

July 31, 2013 at 1:59 AM

ఏప్పటిలాగానె భాగా రాశావు శ్రికాంత్. నువ్వు చెప్పిన వాళ్ళందరిదీ "పిడికెడే" కాని ప్రజలది మాత్రం "దోసెడు".
ఇన్నిజరిగినా, జరుగుతున్నా, జరగబొతున్నా కూడా వాదం/సిద్దాంతాలతో పనిలెకుండా, ఢిల్లీ లొ తెలుగును "కాలిగుండు" ఆడుకుంటున్న"గాంధీ"(ఇందిర/సొనియా/రాహుల్)అనె పేరుని నెత్తిన,"హస్తం" అనే గుర్తును ముద్దు పెట్టుకుంటున్న ఈ జనాలకి మాత్రం పిదికెడు తక్కువె.ఇప్పుడే జరిగిన పంచయతీ ఎన్నికలే ఉదాహరణ.

మా తెలుగు తల్లికి ముళ్ళపూదండ,మాకన్న తల్లికి చివరి హారతులు!!!

Reply
July 31, 2013 at 5:30 AM

బాగా చెప్పారు.

ఇప్పుడు తెలుగువాళ్ళు చేయవలసిన పనల్లా విఛ్ఛిన్నకర శక్తులకు ఒక్కఓటూ ఒక్కసీటూ రాకుండా చేసి ఛీకొట్టటమే.

నూటికినూరుపాళ్ళూ చట్టసబ్లలో సీట్లన్నీ సంపాదించి ఢిల్లీసుల్తానులను గడగడలాడించతమే.

వినటానికి బాగున్నాయి ఆలోచనలు!

అయినా మన పిచ్చి కాని అంత వివేకం తెలుగువాళ్ళకు ఉంటే ఇలా ఇల్లు ముక్కలయ్యేదా?

Reply
July 31, 2013 at 6:10 AM

ఇవేమి కావు. ఈ పాపం 1956 నుండి సీమాంధ్రులు తెలంగాణ వారిపై చూపుతున్న ఆభిజాత్యం, అహంకారాలది.

Reply
July 31, 2013 at 6:48 AM

Paina cheppina karanalem kadu gani chivar cheppina ee statement matram 100% correct "కులం కోసం, మతం కోసం, సినిమా గ్లామర్ కోసం కుత్తుకలు తెగ నరుక్కొని, నోట్ల మత్తులో వోట్లు తనఖా పెట్టి అసమర్థ ప్రజా ప్రతినిధులను అందలాలెక్కించి ఆ తర్వాత ఈసురోమంటున్న సీమాంధ్ర ప్రజలదా ? వాళ్ళ అజ్ఞానానిదా ?"

Reply

@సోమా,

నీ కామెంటు ఘాటుగా, ఆలోచనాత్మకంగా ఉంది.రాష్ట్రాన్ని విభజించినా ఇంకా పంచాయితీ ఎలెక్షన్లలో చోట్ల కాంగ్రెస్ గెలుస్తోందంటే ప్రజాస్వామ్యం పైనే నాకు నమ్మకం పోతోంది.


@శ్యామలీయం గారు,

తెలుగువాళ్ళు తన్నుకోవడంలో సిద్దహస్తులు.అంత ఐకమత్యమే ఉంటే ఇంతమంది ఎం.పి.లు ఉండీ ఇందాకా వచ్చేదా పరిస్థితి ?

@షాయి గారు,

ఆభిజాత్యం, అహంకారం టి.ఆర్.ఎస్ లో లేదా ? మానవతా దృక్పథంతోనేనా మమ్మల్ని తరిమికొడతాం అని మొన్నటిదాకా అరిచారు ?

@ఆదిత్య గారు

మీ స్పందనకు ధన్యవాదాలు.

Reply
Anonymous
July 31, 2013 at 11:34 PM

@ ఆభిజాత్యం, అహంకారాలది....
విసుగేసి కామెంటుతున్నా,,,ఉదయం లేచిన దగ్గర నుంచీ ఇదే పనిగా ఉంటారా జనం?ఎవడి బ్రతుకు వాడు వెళ్ళ దీస్తూ ఉంటాడు...పక్క వాడిని పట్టుకుని... ఆభిజాత్యం, అహంకారాలు ప్రదర్శిస్తూ కూర్చోడు ఎవరూ...రెచ్చ గొట్టుడు ఉపన్యాసాలకు ఉపయోగపడ్డానికే ఈ పదాల వాడకం...హోటల్లోనో...బస్లోనో..సినిమా హాల్లోనో..ఇంటి పక్కనే ఎవడున్నాడో పట్టీంచుకోని రోజుల్లో...ఎందుకండీ ఈ ఉపన్యాసాల అక్షరాల ఇంద్రజాలం... ఆభిజాత్యం, అహంకారాలట..ప్రపంచమంతా ఒకటయిపోతోంటే..ఈ నాటకీయమయిన డైలాగులు ఇక్కడే వినబడతాయ్...వంక లేనమ్మ డొంకొట్టుకుని వేలాడిందన్నట్టు...

Reply

Kvsv గారు,

మీ స్పందన అద్భుతంగా ఉంది.మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

Reply
Post a Comment