తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మా నాన్నగారి పుస్తకం
మా నాన్నగారు ప్రజారోగ్యం మీద తెలుగులో 704 తేటగీతి పద్యాలతో "ఆరోగ్యగీత" అనే పుస్తకం వ్రాశారు. ప్రజారోగ్యం మీద తెలుగులో చాలా పుస్తకాలు వచన రూపంలో వచ్చాయి. కానీ ఇంతవరకు ఎవరూ ఇలా పద్యాలతో పుస్తకం వ్రాయలేదు. అలాగే ఆయన 100 పద్యాలతో "ఆరోగ్య శతకం" వ్రాశారు. ప్రజారోగ్యం మీద ఎవరూ తెలుగులో శతకం వ్రాయలేదు. మా నాన్నగారి పుస్తకమే మొదటిది.ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మా నాన్నగారికి సన్మానం చేసి, ధృవపత్రం అందజేశారు.