నేను కనుక్కున్న రహస్యం !!

సిద్ధార్థుడికి బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం అయినట్లు నిన్ననే నాకొక రహస్యం బోధపడింది.అదేంటంటే పుట్టిన ప్రతి మనిషీ కాస్త తీర్థం పుచ్చుకోక తప్పదు. తీర్థం అంటే గుళ్ళో ఇచ్చే తులసి తీర్థం కాదండోయ్.అక్షరాలా ఆల్కహాలే.ఆడైనా మగైనా ఎవరికైనా ఇది తప్పదు.అలాగని ఎవరూ తప్పించుకోనూలేరు.ఎంతంటి సంప్రదాయవాదులైనా,బిర్రబిగుసుకొని ఎంత మడిగట్టుకు కూర్చున్నా,'హరిహర బ్రహ్మాదులు సైతం నా చేత ఆ పని చెయ్యించలేర'ని భీషణ ప్రతిజ్ఞలు చేసినా మీకు తెలియకుండా మీరే కాస్త మందు పుచ్చుకొని వొళ్ళు తూలుతూంటే,గాల్లో తేలిపోవటం ఖాయం.

నాకైతే ఇది మొదటిసారి కాదు.

పెళ్ళికి ముందు కూడా ఒకసారి ఇలాగే దగ్గు వదలకుండా పట్టి పీడిస్తూంటే అప్పటి నా కాబొయే శ్రీమతి కోరిక మేరకు బెనిడ్రిల్ కాఫ్ సిరప్ తాగా(సామాన్యంగా జ్వరాలు,జలుబులు వస్తే నేను వెంటనే ఇంగ్లీషు మందులు వాడను.వీలైతే కాస్త గృహ వైద్యం చేసుకుంటాను.శరీరానికి కొంచెం తట్టుకొనే శక్తి ఉండాలని అలా చేస్తూంటానన్నమాట.ఇలాగే ఒకసారి జ్వరంతో వొళ్ళంతా చలిచలిగా ఉంటే,ముల్లుని ముల్లుతోనే తియ్యాలని, మా తమ్ముళ్ళతో కలిసి ఊరి చెరువులో మునకలేశాను.నా అదృష్టం బావుండి వెంటనే జ్వరం తగ్గిపోయింది).ఒక కప్ తాగితే తగ్గదేమోనని,రెండు మూడు కప్స్ తాగాను.ఆ రోజు రాత్రి లేట్ నైట్ బస్ పట్టుకొని తిరుపతి వెళ్ళాలి.ఇహ చూస్కొండి నా పరిస్థితి.ఒక వైపు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.ఇంకో వైపు వోళ్ళు సోలిపోతొంది.ఒక తాగుబోతులాగా నా రూం నుంచి లోంచి బయటపడి,వాలిపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచిపెట్టుకొనే ప్రయత్నం చేస్తూ అపసోపాలు పడతా వచ్చి ఆటో లో కూర్చున్నాను.అలాగే బస్టాండ్ చేరుకొని బస్సెక్కి నా సీట్లో వాలిపోయి నిద్రపోయాను.తిరుపతిలో దిగి,ఇంటికెళ్ళి నిద్రపోయి మళ్ళీ లేచాక కూడా ఆ హ్యాంగోవర్ వదల్లేదు.

చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్న అదే పరిస్థితి వచ్చింది.ఈ సారి కూడా వేడి పాలల్లో పసుపు మిరియాలపొడి కలుపుకొని తాగటం లాంటివి చేశాను కాని ఏమీ ఫలితం కనిపించలేదు.బెనిడ్రిల్ లో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందని మా ఆవిడ వేరొక దగ్గుమందిచ్చింది.బెనిడ్రిల్ కాదు కదా అని చెప్పి ఈ మందు కూడా రెండు మూడు కప్స్ గటగటా తాగేశాను.కళ్ళు బైర్లు కమ్మటం,వొళ్ళు పట్టుతప్పిపోవటం,రాత్రంతా పడుకుని లేచి ఆఫీసుకెళ్ళాక కూడా నిద్ర ముంచుకురావటం..ఇలా చరిత్ర పునరావృత్తమైంది.

ఏతావాతా నాకు తెలిసిందేమిటంటే ఏ దగ్గుమందులోనైనా ఆల్కహాల్ ఉంటుందని.టేస్ట్ బావుంటుందని మూడు నాలుగు కప్స్ తాగితే ఒళ్ళు తూలటం తప్పదని.దీని సంగతేంటో తేల్చుకుందామనుకొని కొంతమంది మందుబాబులను కదిపితే వాళ్ళు చెప్పిందేమిటంటే బీరు బాటిల్లో కంటే దగ్గుమందులోనే ఆల్కహాల్ శాతం ఎక్కువుంటుందని.ఆల్కహాల్ వల్ల ప్రత్యక్ష లాభం లేకపోయినా,శరీరాన్ని రిలాక్స్ చేయ్యటం వల్ల దగ్గుకి ఉపశమనం దొరుకుతుందని దగ్గుమందులో వాడుతారట.

కాబట్టి పుట్టిన ప్రతి మనిషీ తాగక తప్పదు.ఆ మాటకొస్తే శైశవ దశలోనే మందు రుచి చూడక తప్పదు.ఇది అనివార్యం.భగవద్గీతలో చెప్పినట్లు 'ఇట్టి దాని గురుంచి శోకింప తగదు '.10 comments

June 18, 2010 at 9:39 PM

హ్హ హ్హ హ్హా! మీ ఫస్ట్ పేరా చదవగానే నాకు అర్థమయిపోయింది మీరు దగ్గు మందు గురించే చెప్తున్నారని ;-) అన్నట్టు, నాకో సంగతి గుర్తొచ్చింది. చిన్నప్పుడు నేనొకసారి తీయగా ఉంది కదా అని సుబ్బరంగా సగం బాటిల్ (చిన్నదేలెండి) ఖాళీ చేసి తెగ నిద్రపోయానట! :-D

Reply
June 19, 2010 at 2:24 PM

Hello!
Certainly a funny post. But the matter of the fact is cough syrups do not have any alcohol content. Most of these preparations have an antihistaminic drug called Diphenhydramine which can produce sedation as a side effect which in turn, if taken in large quantities can make you sleep for hours together.
This is meant just for information.And do not carry any notions like allopathic medications in general are detrimental to the health or it is good to avoid them etc., etc.,. Yes any kind of abuse of anything should be avoided.
Good day.

Reply
June 19, 2010 at 3:50 PM

మందును మందులాగా పుచ్చుకోవటం తప్పు లేదు అండి. అది మళ్ళి మళ్ళి తాగాలనిపిస్తే మీరు కంగారు పడవచ్చు , మీకు కూడా మందు అలవాటైంది అని.

Reply

@ మధురవాణి గారు :-)

@ Venu garu,
Thank you.
Iam not averse to allopathy and I don't have any such notions.I make sure I consume them only when it is absolutely required :-)


@mady's gAru
నిజమే .ఈ రేంజిలో నిద్రముంచుకొస్తే మందు కోసం దగ్గుమందు పుచ్చుకోవాలనుకున్నవాడు కూడా పుచ్చుకోరు లెండి.మేలుకుంటే కాస్త ఎక్కువ తాగొచ్చని అసలు సరుకే తాగుతారు :-)

Reply
June 20, 2010 at 12:44 PM

Very nice.

If at all there is Ban on Liquor

Somebd may go for Cough-syrup.

Where there is a will..

There is a way.

rputluri@yahoo.com

Reply

రాం నర్శింహ గారు,
Thank you

Reply
June 21, 2010 at 11:24 AM

:) :)

Reply

'పరిమళం' గారు కృతజ్ఞతలు

Reply
June 21, 2010 at 10:03 PM

@VENU..

Your opinion is very interesting..

I cld nt understand very well..

Any how thanks..

Reply
Post a Comment